రాష్ట్రీయం

కార్పొరేట్‌కు మించి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: ఇంటర్మీడియట్ విద్యను పటిష్టం చేసి తెలంగాణను దేశంలోనే ప్రథమస్థానంలో నిలుపుతామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆర్టీసీ కళ్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రిన్సిపాళ్ల వర్కుషాప్‌నకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అధ్యాపకులు బోధనను ఉద్యోగ ధర్మంగాకాకుండా సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో 80శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులే ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నండి విద్యార్థుల నమోదు రెండు లక్షలు దాటాలని సూచించారు. వసతులు, నిర్వహణకు 275 కోట్లు ఖర్చు చేస్తున్నామని కడియం చెప్పారు. వేతనాలు పెంచామని, పదోన్నతులు కల్పించామని, కనుక ఇక మంచి ఫలితాలను తీసుకురావాలని సూచించారు. ఈసారి ఫలితాల్లో మిగతా విద్యార్థులంతా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనే చేరేలా చూడాలని చెప్పారు. వేసవి సెలవుల్లో ఎంసెట్, జెఇఇ, నీట్ పరీక్షలకు కోచింగ్ కేంద్రాలను ఏర్పాటచేసి శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. పూర్వ పది జిల్లాల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా 20 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం తరఫున వసతి, భోజనం కల్పిస్తామని, బోధన కోసం స్వచ్ఛందంగా ప్రభుత్వ ప్రిన్సిపాల్స్ రావాలన్నారు. ఇంటర్ గ్రామీణ విద్యార్థులకు ఉచిత బస్ పాస్ ఇస్తామని, మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని వెల్లడించారు. పరీక్షల సమయంలో కాలేజీల్లో ఎక్కువ సమయం గడిపేలా ప్లాన్ చేసుకోవాలని కడియం శ్రీహరి ప్రిన్సిపాళ్లకు సూచించారు. గత రెండేళ్లుగా కొత్త భవనాలు, అదనపు క్లాసు రూములు, ఫర్నీచర్, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ మిషన్లు, ల్యాబ్ మెటీరియల్, గేమ్స్ స్పోర్ట్సు మెటీరియల్, ఆర్వో ప్లాంట్లు, కంప్యూటర్లకు 275 కోట్లు మంజూరు చేశామని, దీంతోపాటు లెక్చరర్ల వేతనాలకు 160 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులు రెగ్యులరైజ్ చేయడానికి జీవో-16 తెచ్చామని, కొంతమంది కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. వచ్చే ఏడాది ఇంటర్ కాలేజీల నిర్వహణ గ్రాంట్ కింద కాలేజీకి లక్ష రూపాయిలు ఇస్తామని చెప్పారు. ఈ గ్రాంటువల్ల ప్రభుత్వంపై నాలుగు కోట్లు భారం పడుతుందని తెలిపారు. నీట్‌వంటి జాతీయ ప్రవేశ పరీక్షలకు 20 ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇంటర్ విద్యలో అనేక సంస్కరణలు తెచ్చామని బోర్డు కార్యదర్శి అశోక్ చెప్పారు. పది కోట్ల రూపాయిలతో జూనియర్ కాలేజీల్లో ఐసిటి అమలు చేస్తున్నామని అన్నారు. బోర్డులో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు.
డిప్యుటీ సీఎం శ్రద్ధతో కొత్త వెలుగు
ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో జూనియర్ కాలేజీలు పటిష్టమయ్యాయని, కాలేజీలకు కొత్త వెలుగు వచ్చిందని జేఏసీ చైర్మన్ మధుసూధన్ రెడ్డి పేర్కొన్నారు. ఇంకో 20ఏళ్ల వరకూ జూనియర్ కాలేజీల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా చేశారన్నారు. నమోదు పెంచేందుకు, ప్రామాణిక విద్యను అందించేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేస్తున్న కృషి చిరస్మరణీయమని అన్నారు. ప్రిన్సిపాళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు నర్సిరెడ్డి మాట్లాడుతూ పిల్లల నుండి వసూలు చేస్తున్న పరీక్ష ఫీజును రీయింబర్స్‌మెంట్ చేయాలన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించిన ప్రిన్సిపాళ్లు తమ అనుభవాలను వివరించారు.

చిత్రం..ఇంటర్మీడియట్ కాలేజీ ప్రిన్సిపాళ్ల వర్క్‌షాపులో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి