రాష్ట్రీయం

పవర్.. పెంచుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 10: రాష్ట్రంలో ప్రతి ఇంటినీ ఇంధన సామర్థ్యం వెల్లివిరిసేలా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇంధన పరరిక్షణ ఆవశ్యకతపై ఉద్యమస్ఫూర్తితో ప్రజలను మరింత చైతన్యపర్చాలని ఆదేశించారు. ఇంధన సామర్థ్య సాధనలో ప్రపంచ అగ్రదేశాల్లో ఉన్న ఉత్తమ పద్ధతులను అనుసరించాలని, తద్వారా ఒనగూరిన ఫలాలు వినియోగదారులకు చేరేలా కృషి చేయాలని ఉద్బోధించారు. ఇంధన సామర్థ్యం, ఇంధన పరిరక్షణపై ఇంధన శాఖ ఉన్నతాధికారులతో ఆయన హైదరాబాద్ నుంచి ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 2020 నాటికి గృహ, పారిశ్రామిక వినియోగంలో రాష్ట్రం 19,079 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేసే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇంధన సామర్థ్యం పెంపు విషయంలో అగ్రగామి దేశాలైన యుకే, అమెరికా, చైనా, దక్షిణ కొరియాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై అధ్యయనం చేసి రాష్ట్రంలో అనుసరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సుస్థిర ఆర్థికాభివృద్ధికి, వినియోగదారులకు విద్యుత్ బిల్లులు తగ్గించడానికి ఇంధన సామర్థ్యంలో ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఉత్పాదక వ్యయంతోనే వినియోగదారునికి విద్యుత్ అందించడంలో ఇంధన సామర్థ్యానిది కీలక పాత్ర అని ఆయనన్నారు. విద్యుత్ ఆదా ద్వారా మిగిలిన వనరులతో గృహ నిర్మాణం, ఎంఎస్‌ఎంఈ (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్), స్టార్టప్స్, చిన్న తరహా హరితావరణ పరిశ్రమలు, వైజ్ఞానిక ఆధారిత పరిశ్రమలు, లాజిస్టిక్స్, సామాజిక వౌలిక సదుపాయాలైన కనె్వన్షన్ సెంటర్లు, బహుళ ప్రయోజన ఆస్పత్రులు, ప్రపంచ స్థాయి విద్యాసంస్థల్లో ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు మార్గం ఏర్పడుతుందన్నారు. ఈ నెల 14 నుంచి 20 వరకు జరిగే జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల సందర్భంగా ప్రస్తుత ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన వనరులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. తాప విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం కాలుష్య కారకాలను తగ్గించేందుకు అనుసరిస్తున్న అంతర్జాతీయ సాంకేతికతపై ఆయన ఐటీ ముఖ్య కార్యదర్శి, జెన్కో ఎండీ, ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌కు దిశానిర్దేశం చేశారు. ఇంధన సామర్థ్యం కోసం అనుసరించే ఏ పథకమైనా అంతిమంగా ప్రజలకు మేలుచేసేదిగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రతి ఇంటినీ ఇంధన సామర్థ్యం కలిగినదిగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
‘విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 2014 జూన్ నాటికి విద్యుత్ కోతలు, పవర్ హాలిడేస్ పీడకలల్లా వెంటాడాయి. రోజూ 8 నుంచి 12 గంటల దాకా నిరవధిక విద్యుత్ కోతలు ఉండడంతో నాడు జనంలో అసంతృప్తి, అసహనం ఏ స్థాయిలో ఉన్నాయో చూశాం. అలాంటి రోజులను ఇంకా మరచిపోలేదు. ఈనేపథ్యంలో 2014లో అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిరంతర విద్యుత్ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నాం. దేశంలో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాల్లో గుజరాత్ తర్వాతి స్థానం మన రాష్ట్రానిదే. విద్యుత్ అంతరాయాలు అంతగా లేని, విశ్వసనీయమైన, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే దేశాల సరసన మనం నిలిస్తేనే సంతృప్తిగా ఉంటుంది’ అని అన్నారు. రాష్ట్ర ఇంధన శాఖ వినియోగదారులకు ఇంధన సామర్థ్య గృహోపకరణాలను నెలవారీ సులభ వాయిదాల్లో అందించేందుకు ప్యాకేజీలను ప్రతిపాదించింది. రాష్ట్ర విద్యుత్
నియంత్రణ కమిషన్‌కు వీటిని అందించింది. ఈ ప్యాకేజీ వివరాలను ఐ అండ్ ఐ, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ముఖ్యమంత్రికి వివరించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వం ప్రతిపాదించిన సులభ వాయిదా పద్ధతుల్లో అందజేసే పథకం గురించి వివరించారు. బీపీఎల్ కుటుంబాలకు బల్బు, ఫ్యాన్, ట్యూబ్‌లైట్‌ను 1299 రూపాయలకు, ఏపీఎల్ కుటుంబాలకు రెండు బల్బులు, రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు 2598 రూపాయలకు ఇవ్వనున్నారు. 24 సులభ వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ప్రతిపాదించారు. టెలీకాన్ఫరెన్స్‌లో ఇంధన వనరుల శాఖ మంత్రి కళా వెంకటరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి జి సాయిప్రసాద్, ఇంధన శాఖ సలహాదారు కె రంగనాథం, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీలు దినేష్ పరుచూరి, ఉమాపతి, ఏపీ ఇపీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర తదితరులు పాల్గొన్నారు.