రాష్ట్రీయం

తెలుగు మహాసభల ప్రచారానికి సైకిల్ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: ప్రపంచ తెలుగు మహాసభల ప్రచారం కోసం సైకిల్ యాత్రను తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిధారెడ్డి ఆదివారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ మహాసభలకు తెలుగు వారందరినీ ఆహ్వానిస్తున్నామని సిధారెడ్డి తెలిపారు. మహాసభల విశిష్టతను తెలియజేసే విధంగా ఈ సైకిల్ యాత్ర కూడా దోహదం చేస్తుందని సిధారెడ్డి తెలిపారు. జనగామ జిల్లా తరిగొప్పలకు చెందిన యువకుడు కొత్తపల్లి నాగరాజుతో ప్రారంభించిన సైకిల్ యాత్ర దిగ్విజయంగా తిరిగి హైదరాబాద్ చేరాలని ఆశీర్వదించారు. నాగరాజు తెలంగాణ వ్యాప్తంగా 31 జిల్లాలను చుడుతూ 2,200 కి.మీ మేర సాగుతుందని వెల్లడించారు. సాహిత్య అకాడమి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఆరు రోజుల పాటు కొనసాగి మహాసభల ప్రారంభ సమయానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంకు చేరుకుంటుందని తెలిపారు. నాగరాజు సైకిల్ యాత్రకు ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి వ్యక్తిగతంగా 25 వేలు సహాయం చేయగా, ప్రభుత్వం నుంచి లక్ష ఆర్ధిక సహాయం కేటాయిస్తున్నట్లు సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

చిత్రం.. కొత్తపల్లి నాగరాజు సైకిల్ యాత్రకు సాహిత్య అకాడమి నుంచి జెండా ఊపుతున్న చైర్మన్ నందిని సిధారెడ్డి