రాష్ట్రీయం

రెండు నెలల్లో ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 10: ఫ్లోరైడ్ పీడిత ప్రాంత ప్రజలకు, రైతులకు తాగు, సాగునీరందించే లక్ష్యంతో ఎస్‌ఎల్‌బీసీ బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను రెండు నెలల్లో పూర్తి చేసి ప్రారంభించబోతున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. ఆదివారం ఆయన మంత్రి జి.జగదీష్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి నల్లగొండ మండలంలో కోదండపురం వద్ధ ఏఎమ్మార్పీ కాలువలను పరిశీలించారు. రైతులు కాలువ దాటేందుకు పడుతున్న ఇబ్బందులను మంత్రి హరీష్‌కు వివరించగా వంతెన మంజూరు చేస్తు ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలిచ్చారు.
అటు నుండి నార్కట్‌పల్లి సమీపంలోని చౌడంపల్లి, బ్రాహ్మణవెల్లంల వద్ద ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం సర్జ్ఫుల్, టనె్నళ్లు, పంప్‌హౌస్, రిజర్వాయర్లు, కాలువల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉదయ సముద్రం ఎత్తిపోతలను పట్టించుకోకపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకా ఆటోమెటిక్ బూమర్స్ తెప్పించి టనె్నల్ పనులను వేగంగా జరిపిస్తోందన్నారు. కేవలం అర కిలోమీటర్ పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గ్యాంట్రీ క్రెన్ సైతం వచ్చినందునా జనవరి 10కల్లా మోటార్లు బిగించి ట్రయల్ రన్‌తో నీళ్లు పోయించాలని నిర్ణయించామన్నారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా రిజర్వాయర్‌లు, చెరువులు నింపి ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. బోర్లు, బావుల కింద ప్రస్తుతం యాసంగి పంట సాగు చేస్తున్న వారికి చివరి దశలో నాటికి నీళ్లందించే ప్రయత్నం చేస్తామని, వచ్చే వానకాలం నాటికి పనులు అన్ని చెరువులు నింపేలా ప్రయత్నిస్తున్నామన్నారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్, మెగా కంపెనీలు సంయుక్తంగా లైనింగ్ పనులు జరిపించాలని ఆదేశించామన్నారు. రిజర్వాయర్‌కు సంబంధించి ఎనిమిది వందల మీటర్ల స్టోన్ బ్రిచింగ్, గ్రాస్ లాన్ ఏర్పాటు పనులు డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. జిల్లా కలెక్టర్‌ను ప్రతి వారం సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, సీఈ శరత్, ఎంపీపీ రెగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి, నాయకులు బడుగు లింగయ్య యాదవ్, కంచర్ల భూపాల్‌రెడ్డిలు పాల్గొన్నారు

చిత్రం..బ్రాహ్మణవెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న మంత్రులు హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి