రాష్ట్రీయం

విజయ్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: హాస్య నటుడు విజయ్‌సాయి ఆత్మహత్య కేసు మరో కీలక మలుపు తిరుగుతోంది. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని తన నివాసంలో విజయ్‌సాయి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తొలుత సినిమాల్లో అవకాశాలు రాకపోవడం, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్టు భావించారు. కానీ..ఆత్మహత్యకు ముందు విజయ్‌సాయి సెల్‌ఫోన్‌లో తీసుకున్న సెల్ఫ్ వీడియోలో పలువురిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పరువు, మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నట్టు విజయ్ వీడియోలో పేర్కొన్నారు. భార్య వనిత చెడుప్రవర్తన, పారిశ్రామిక వేత్త శశిధర్, న్యాయవాది శ్రీనివాస్ వేధింపుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు విజయ్ వీడియోలో పేర్కొన్నట్టు డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. వీరంతా తనను మానసికంగా హింసించారని, డాడీ..ఎవర్నీ విడిచిపెట్టొద్దు..అందరికి శిక్ష పడేలా చూడు..లవ్ యూ డాడీ..నా కూతురు అలాంటి వాతావరణంలో పెరగడం ఇష్టం లేదు..తీసుకుని రండి డాడీ..అంటూ విజయ్ సాయి సెల్ఫీ వీడియోలో పేర్కొన్నట్టు డీసీపీ వివరించారు. విజయ్ సాయి భార్య వనిత, న్యాయవాది శ్రీనివాస్, శశిధర్‌పై కేసు నమోదు చేశామని, భార్యభర్తల మధ్య చాలాకాలంగా గొడవలున్నాయి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.
శశిధర్ ఎవరో తెలియదు: వనిత
విజయ్‌సాయి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియదు..శశిధర్ ఎవరో తెలియదు..విజయ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు..అతని మృతిపై అనుమామానం ఉందని విజయ్‌సాయి భార్య వనిత మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తాము వేరుగా ఉంటున్నామని, విడాకుల కోసం పెట్టుకున్న అర్జీ కోర్టులో నడుస్తుండగా, ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని వనిత తెలిపింది. తనకు శశిధర్‌తో అక్రమ సంబంధం అంటగట్టడం సమంజసం కాదన్నారు. విజయ్, అతని తండ్రి మధ్య ఆస్తితగాదాలు నడుస్తున్నాయని, తాను సంపాదించిన ఆస్తి మాత్రమే విజయ్‌ను అడిగానని వనిత స్పష్టం చేసింది. తన భర్త విజయ్‌సాయికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందో తనకు తెలియదని, అయితే విజయ్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఆమె తెలిపింది. కళ్ళారా చూసిన తరువాతే, విజయ్‌తో దూరంగా ఉండాలనుకున్నానని, అందుకే రెండేళ్లుగా వేరే ఉంటున్నానని వనిత చెప్పారు. విజయ్‌కు ఎయిడ్స్ ఉందని, అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళే స్వయంగా చెప్పిందని వనిత చెప్పారు.
హాస్య నటుడు విజయ్‌సాయి ఆత్మహత్య ఘటనపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. పలువురు నటులు విజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మా అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ, ఏవైనా సమస్యలు ఉంటే తమతో చెప్పుకోవాలని, ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. గతంలో సీనియర్ నటుడు రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్న సమయంలోనూ తాను ఇదే విధమైన విజ్ఞప్తి చేసినట్టు ఆయన గుర్తుచేశారు.

చిత్రం..విజయ్‌సాయి, వనిత పెళ్లినాటి ఫొటో