రాష్ట్రీయం

కేంద్రం వెంటపడి పోలవరం పూర్తి చేయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: కేంద్రం వెంటపడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయించాల్సిన బాధ్యత ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. కమీషన్ల కోసమే పోలవరం నిర్మాణ బాధ్యతను ముఖ్యమంత్రి తీసుకున్నారని బుగ్గన సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. రూ.16 వేల కోట్లపైన ఎంత ఖర్చైనా రాష్ట్రం భరిస్తుందని ఎందుకు ఒప్పుకున్నారని ఆయన ప్రశ్నించారు. మిగతా రూ.38 వేల కోట్లు ఎవరు భరించాలని, రెండేళ్ళుగా ఎందుకు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, ఒక్కొక్కరి నెత్తిన రూ.50 వేల అప్పు ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కుగా రాష్ట్ర విభజన సమయంలో సంక్రమించిందని ఆయన గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును మిగతా ప్రాజెక్టులతో పోల్చలేమని, ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల హక్కు అని అన్నారు. ప్రతి సోమవారం - పోలవారంగా మార్చుకున్నానని ఇంత కాలం ప్రచారం చేసుకుని ఏమి సాధించారని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టును ముఖ్యమంత్రి 27 సార్లు, నీటి పారుదల శాఖ మంత్రి 47 సార్లు సందర్శించి ఏమి సాధించారని బుగ్గన ప్రశ్నించారు.
వైకాపా ఎన్‌ఆర్‌ఐ కమిటీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం పార్టీ ఎన్‌ఆర్‌ఐ కమిటీని ప్రకటించారు. ఆస్ట్రేలియా కన్వీనర్‌గా కెవి రమణా రెడ్డి, కో-కన్వీనర్‌లుగా జి.వెంకట్, ఎల్.శేఖర్‌ను నియమించారు.