రాష్ట్రీయం

8 మంది నక్సల్స్ హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, డిసెంబర్ 14: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మేళ్లమడుగు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో సీపీఐ(ఎంఎల్) చండ్ర పుల్లారెడ్డి వర్గానికి చెందిన 8 మంది నక్సల్స్ మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నక్సల్స్ కదలికలపై టేకులపల్లి, గుండాల మండలాల పోలీసులతోపాటు స్పెషల్ పార్టీకి చెందిన పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు. దీనికి జవాబుగా పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో 8 మంది నక్సల్స్ అక్కడికక్కడే మృతిచెందారు. పాల్వంచ మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన దళ కమాండర్ ఎట్టి కుమార్ అలియాస్ రాఖీ (35), వరంగల్ జిల్లా మంగపేటకు చెందిన ఆజాద్(25), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకకు చెందిన నూనావత్ అర్జున్ అలియాస్ నవీన్ (22), మహబూబాబాద్ జిల్లా పెద్ద ఎల్లాపురానికి చెందిన ఆర్‌ఎంపి వైద్యుడు బైన ఓంప్రకాష్ అలియాస్ గణేష్ (39), గుండాల మండలం కొడవటంచ గ్రామానికి చెందిన ఈసం నరేష్ అలియాస్ సుదర్శన్ (30), గుండాలకు చెందిన తురకాని మధు(35), మహబూబాబాద్ మండలం కంబాలపల్లికి చెందిన రషీద్(28), టేకులపల్లి మండలం కోయగూడెంకు చెందిన గాడుదుల శ్రీను(40) మృతి చెందారు. మృతుల వద్ద ఏకే 47 రైఫిల్, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్‌తోపాటు ఆరు తుపాకులు, కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం లభించినట్లు జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఝా ప్రకటించారు. ఓఎస్డీ రవీందర్, ఇల్లందు, కొత్తగూడెం డిఎస్పీలు ప్రకాష్‌రావు, ఎస్‌ఎం ఆలీలతోపాటు టేకులపల్లి, గుండాల సీఐలు దోమల రమేష్, రవికుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మృత దేహాలకు కొత్తగూడెం తహశీల్దారు అశోక చక్రవర్తి, పాల్వంచ తహశీల్దారు గన్యా, లక్ష్మీదేవిపల్లి తహశీల్దారు సునిల్‌లు పంచనామా నిర్వహించారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన మృతదేహాలను చూసేందుకు వచ్చిన బంధువులను పోలీసులు అడ్డుకోవటంతో ఇల్లందు మాజీ శాసన సభ్యులు గుమ్మడి నర్సయ్య ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా మృతుల బంధువులు పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇది బూటకపు ఎన్‌కౌంటర్ : మాజీ ఎమ్మెల్యే నర్సయ్య
ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతులపై గతంలో ఎటువంటి కేసులు లేకున్నా ఎనిమిది మందిని మట్టుబెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.

చిత్రాలు..ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నక్సలైట్లు
*ఘటనా స్థలంలో దొరికిన ఆయుధాలు