రాష్ట్రీయం

ఎన్‌కౌంటర్లపై నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుల పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నక్సల్స్ శవపరీక్షల నివేదికలు, వాటి వీడియో రికార్డింగులను సమర్పించాలని పోలీసు శాఖను ఉమ్మడి హైకోర్టు సోమవారం నాడు ఆదేశించింది. ఎన్ కౌంటర్ ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన ప్రజాప్రయోజనా వాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్ కౌంటర్ పేరుతో ఎనిమిది మందిని కాల్చి చంపారని, దీనికి సంబంధించి పోలీసులపై కేసు నమోదు చేయాలని పౌరహక్కుల సంఘం తరఫున న్యాయవాది కోర్టును కోరారు. శవపరీక్షలను జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం చేపట్టాలని అన్నారు. దానిపై పోలీసుల తరఫున న్యాయవాది స్పందిస్తూ అది నిజమైన ఎదురుకాల్పులేనని అన్నారు. నిబంధనల మేరకే పోస్టుమార్టం నిర్వహించామని తెలిపారు. అయితే ఎన్ కౌంటర్ మృతుల పోస్టుమార్టం, నివేదికలు, శవపరీక్ష నిర్వహించినపుడు చిత్రీకరించిన వీడియో రికార్డింగులను సమర్పించాలని పోలీసులను ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.