రాష్ట్రీయం

మాతృభాష సంరక్షణకు నడుం బిగిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: మాతృ భాషా పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు సభలో గవర్నర్ ప్రసంగిస్తూ తెలుగు భాష గొప్ప సంపదన్నారు. తెలుగు భాషాభిమానులతో బమ్మెర పోతన ప్రాంగణం పులకించిందన్నారు. ఈ ఐదు రోజుల పాటు తెలుగు మహాసభలు అత్యంత వైభవోపేతంగా జరిగాయని గవర్నర్ ప్రశంసించారు. తెలుగు భాషాభివృద్ధికి తల్లిదండ్రులందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పిల్లల పుట్టిన రోజున తల్లిదండ్రులు ఒక తెలుగు పుస్తకాన్ని బహుకరించాలని గవర్నర్ సూచించారు. మాతృభాష వికాసం కుటుంబం నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతానికి కృషి చేసిన ప్రభుత్వ యంత్రాంగాన్ని గవర్నర్ అభినందించారు.