రాష్ట్రీయం

లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, జనవరి 2: లైంగిక వేదింపుల కేసులో గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను మంగళవారం పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాస్ కార్యాలయంలో ఆర్జేగా విధులు నిర్వహిస్తున్న యువతి పక్కా ఆధారాలతో పోలీసులను ఆశ్రయించడంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన కోర్టు ఆయనకు పది రోజుల రిమాండ్ విధించింది. పంజాగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్, బాదితురాలు తెలిపిన వివరాల ప్రకారం...సేవ్ టెంపుల్స్ ప్రచారకర్తగా ఉన్న గజల్ శ్రీనివాస్‌కు పంజాగుట్ట ఆనంద్‌నగర్ కాలనీలో కార్యాలయం ఉంది. గత ఎనిమిది నెలల క్రితం ఆర్జేగా చేరిన యువతిపై కనే్నసిన గజల్ శ్రీనివాస్ చేరినప్పటి నుంచి అసభ్యంగా ప్రవర్తించసాగాడు. గత రెండు నెలల నుంచి యువతిని మరింత వేధింపులకు గురిచేయసాగాడు. తాను అలాంటి దానిని కాదని, తనను వదిలివేయాలని ఎంత చెప్పినా వినిపించుకోకుండా తాను త్వరలో గవర్నర్‌ను అవుతున్నానని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోబాలకు గురిచేసే ప్రయత్నం చేశాడు. అయినా యువతి లోంగక పోయే సరికి తన వద్ద పనిచేస్తున్న మరో మహిళచే బలవంతం చేయించసాగాడు. ఈ వేదింపులతో విసిగి పోయిన బాదితురాలు పోలీసులను ఆశ్రయించింది. గజల్ కార్యాలయంలో జరుగుతున్న రాస క్రీడలను చిత్రీకరించి వాటిని పోలీసులకు అప్పగించింది. దీంతో అతనిపై సంబందిత సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి మంగళవారం ఉదయం అతన్ని అరెస్టు చేశారు. విచారణ జరిపి వాగ్మాలం సేకరించి మధ్యాహ్నం నాంపల్లి న్యాయస్థానంలో హాజరు పరిచారు. కేసు విచారణ జరిపిన న్యాయస్థానం గజల్‌కు పది రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో అతన్ని పోలీసులు జైలుకు తరలించారు. తనకు బెయిల్ ఇవ్వాలని గజల్ పెట్టుకున్న అభ్యర్ధనను కోర్టు తోసి పుచ్చింది. న్యాయస్థానం అనుమతితో మరోమారు అదుపులోనికి తీసుకొని విచారించాలని పంజాగుట్ట పోలీసులు భావిస్తున్నారు.

చిత్రం..లైంగిక వేధింపుల కేసులో గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేసిన దృశ్యం