రాష్ట్రీయం

అవినీతి అధికారి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుంకరనేని రమేష్‌ను ఎసిబి అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడికి జి+3 ఇల్లు, రెండు జి+1 ఇళ్లు, మూడు ఓపెన్ ప్లాట్లు బంగారు, వెండి ఆభరణాలు భారీగా ఉన్నట్లు ఎసిబి అధికారులు కనుగొన్నారు. వనస్థలిపురంలో ఉన్న జి+3 ఇంటి ఖరీదే కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. కొత్తగూడెంలో రూ.5 లక్షల విలువైన ప్లాట్, సరూర్‌నగర్‌లో రూ.30 లక్షల విలువైన మరో ప్లాట్, రూ.25 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ.44 వేల నగదు, బ్యాంక్ నిల్వ రూ.17 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. ఆరు లక్షల విలువైన గృహోపకరణాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డాక్యుమెంట్ల ప్రకారం మొత్తం ఆస్తుల విలువ రూ.2.30 కోట్లు ఉంటుందని, అదే బహిరంగ మార్కెట్లో సమారు రూ.5 కోట్లు దాటుతుందని తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎసిబి డైరక్టర్ జనరల్ తెలిపారు. ఇదిలా ఉండగా, లంచం తీసుకున్న కేసులో కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం మచ్చుపేట గ్రామానికి చెందిన విఆర్‌ఓ వేల్పూరి మోహన్ రావుకు ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమాన విధిస్తూ ఎసిబి కేసుల ప్రత్యేక న్యాయస్ధానం శుక్రవారం తీర్పు వెల్లడించింది. 2009 మార్చి 14న రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్‌హేండెడ్‌గా దొరికిపోయిన మోహన్ రావుపై కోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. తుది విచారణలో నిందితునిపై అభియోగం రుజువు కావడంతో జైలు శిక్ష, జరిమాన విధించబడిందని ఎసిబి డిజి కార్యాలయం తెలిపింది.