రాష్ట్రీయం

వికలాంగ ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), జనవరి 13: రైలు బోగీలోకి ఎక్కలేని వికలాంగులైన ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే మొట్టమొదటిసారిగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వీల్‌చైర్ ద్వారా కాని మరో వ్యక్తి సాయంతో కాని రైలు ఎక్కే వికలాంగుల కోసం ఈ సౌకర్యం ఏర్పాటుచేశారు. మొట్టమొదటిసారిగా దక్షిణ మధ్య రైల్వేలోని గుంటూ రు డివిజన్‌లోని గుంటూరు జంక్షన్ నుంచి వికారాబాద్ వెళ్లే ట్రైన్ నెంబరు 12747 పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఏర్పాట్లు చేశారు. ఈ విధానం ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వికలాంగులు రైలులోకి ఎక్కేందుకు వీలుగా నూతనంగా ఏర్పాటుచేసిన ర్యాంప్‌గా ఐరన్ ప్లేట్‌ని రైలుతో ప్లాట్‌ఫారంతో అనుసంధానం చేస్తారు. దీనివల్ల వీల్‌చైర్‌తో సహా ఎటువంటి ప్రయాస లేకుండానే రైలులోకి చేరుకోవచ్చు. రైలులో విధులు నిర్వహిస్తున్న హౌస్‌కీపింగ్ సిబ్బందిని ఏర్పాటుచేసి వికలాంగులు ఎక్కిన తర్వాత రైలు బయలుదేరే ముందు దాన్ని తొలగిస్తారు. దీన్ని వికలాంగులు ఎక్కే స్టేషన్‌లో మాత్రమే ఏర్పాటు చేయనున్నారు.