రాష్ట్రీయం

అన్ని రంగాలకు బీమా విస్తరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 20: బీమాను అన్ని రంగాలకు విస్తరింపజేయాలని రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప బీమా కంపెనీలను కోరారు. ప్రస్తుతం కొన్ని రంగాలకు మాత్రమే బీమాను వర్తింపజేయడంతో ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారన్నారు. బీమాపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. శుక్రవారం ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ బీమాపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు సంభవించినపుడు ఎక్కువగా నష్టపోతున్నారన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవాలన్నారు. జీతాలపై బతికే కుటుంబాలు కూడా బీమా చేసుకోవడం ఉత్తమమన్నారు. గత ఏడాది హుదూద్ సంభవించినపుడు బీమా చేసుకున్న వారు మాత్రమే బయటపడ్డారని, బీమా చేసుకోని కంపెనీలు ఇప్పటికీ కోలుకోలేకపోయాయన్నారు. రైతులు, కోళ్ల పెంపకందారులు, పరిశ్రమల యాజమాన్యాలు ఇలా అన్ని వర్గాల వారు ఎక్కువగా నష్టపోయారన్నారు. బీమా లేకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. కాగా, బీమా ఉన్న వాటన్నింటికీ పరిహారం చెల్లించారన్నారు. ప్రభుత్వం హుదూద్ నష్టాన్ని భర్తీ చేసేందుకు దాదాపురూ.2200 కోట్లు మంజూరు చేసిందన్నారు.