రాష్ట్రీయం

31న సంపూర్ణ చంద్రగ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 13: ఈనెల 31వ తేదీన సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30గంటల వరకు తిరుమలలో శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. చంద్రగ్రహణం సాయంత్రం 5.18 గంటల నుంచి రాత్రి 8.41 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణం పట్టడానికి 6గంటల ముందు నుంచే ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఉదయం 11 గంటలకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. రాత్రి 10.30 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అంతకమునుపు ఆలయ శుద్ధి, పుణ్యహవచనం కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి శ్రీవారి ఆలయంలో జరిగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.