రాష్ట్రీయం

రోడ్డెక్కిన పోలీస్ పరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ కేపీహెచ్‌బీ కాలనీ, జనవరి 22: వివాహేతర సంబంధాలను అడ్డుకోవాల్సిన పోలీసులూ అదేదారిలో నడుస్తున్నారు. డిఎస్పీ స్థాయ మహిళా అధికారి, ఇన్‌స్పెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తికి మధ్య కొనసాగుతున్న వివాహేతర సంబంధం బట్టబయలైంది. మహిళా అధికారి భర్తే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. సంఘటన పట్ల పోలీస్ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిపార్ట్‌మెంటల్ యాక్షన్ కింద రేపోమాపో సస్పెన్షన్ ఉత్తర్వులు
వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖలో డీఎస్పీ హోదాలోవున్న సునీతారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి సీఐ మల్లిఖార్జునరెడ్డికి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయాన్ని గమనించిన సునీతారెడ్డి భర్త సురేందర్‌రెడ్డి వారిపై నిఘా పెట్టారు.
ఆదివారం రాత్రి కేపీహెచ్‌బీ కాలనీ ఇందు ప్రాజెక్టులోని తన ఫ్లాట్‌లో భార్య సునీత సిఐ మల్లిఖార్జునరెడ్డితో కలిసివున్న సమయంలో సురేందర్‌రెడ్డి, ఆయన తల్లి, బంధువులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి చెప్పులతో దేహశుద్ది చేశారు. తన భార్యను మల్లిఖార్జునరెడ్డి లోబర్చుకుని తనను మానసిక క్షోభకు గురిచేశాడని సురేందర్‌రెడ్డి వాపోయాడు. వారిద్దరి మధ్య జరుగుతున్న వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాలన్న ఉద్దేశంతోనే పక్కా ప్రణాళికతో సురేందర్ రెడ్డి పట్టుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం సాక్ష్యాధారాలతో కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మల్లిఖార్జునరెడ్డిపై ఐపీసీ 447, 497, 506 సెక్షన్ల్ కింద కేసు నమోదు చేశారు. దీంతో ఈ సంగతి ఏసీబీ డీజీ కార్యాలయానికి, మహబూబ్‌నగర్ ఎస్పీ కార్యాలయానికి చేరడంతో ఉన్నతాధికారులు విస్తుబోయారు. పోలీస్ స్టేషన్ వద్ద సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఐ మల్లిఖార్జునరెడ్డి రెండేళ్ల నుంచి తన భార్యను లోబరుచుకున్నాడన్నారు. మానసికంగా హింసించాడని, ఈ క్రమంలోనే తాను ఆత్మహత్య చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అయితే సునీతారెడ్డి, మల్లిఖార్జునరెడ్డిల అక్రమ వ్యవహారాన్ని బయటపెట్టాలన్న ఉద్దేశ్యంతోనే రెండురోజుల క్రితం భార్యకు తెలియకుండానే అమెరికా నుంచి వచ్చానని తెలిపారు. ఇక్కడ జరుగుతున్న తతంగాన్ని కళ్లారా చూసి దిగ్బ్రాంతికి గురయ్యానన్నారు. తన భార్యను లోబరుచుకున్న మల్లిఖార్జునరెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చిత్రం..మల్లిఖార్జున రెడ్డిని చెప్పుతో కొడుతున్న దృశ్యం