రాష్ట్రీయం

దేవాలయాలను పరిరక్షించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: ప్రభుత్వ ఆధీనం నుండి దేవాలయాలను పరిరక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేసినట్టు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు, దేవాలయాల పరిరక్షణ ఉద్యమ కన్వీనర్ డాక్టర్ ఎం వి సౌందరరాజన్ సోమవారం నాడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్వామి దయానంద సరస్వతి దాఖలు చేసిన పిటీషన్లను, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టం అంశంపై సుప్రీంకోర్టులో దీర్ఘకాలం పాటు సాగిన కేసులను ప్రస్తావించారు. ప్రభుత్వాల కబంధాల నుండి దేవాలయాలకు స్వతంత్ర ప్రతిపత్తికల్పించాలని, దేవాలయాల పరిరక్షణకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని స్వామి దయానంద సరస్వతి దాఖలు చేసిన పిటీషన్‌పై మార్చి నెలలో మరోమారు విచారణ జరగనుందని, తెలుగురాష్ట్రాల్లో సైతం దేవాలయాల స్వతంత్రప్రతిపత్తి కోరుతూ తాను ఇంప్లీడ్ పిటీషన్ వేశానని ఆయన వివరించారు. ధర్మమే రారాజు అని పేర్కొంటూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ప్రతిపాదించిన తీర్మానాన్ని రాజ్యాంగ సభలో డాక్టర్ రాధాకృష్ణన్ సమర్ధించారని చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు, దేవాలయాల పరిరక్షణ ఉద్యమ కన్వీనర్ డాక్టర్ ఎం వి సౌందరరాజన్ పేర్కొన్నారు.