రాష్ట్రీయం

విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలని ఇరు తెలుగు రాష్ట్రాలను హైకోర్టు సోమవారం నాడు ఆదేశించింది. ప్రకాశం జిల్లాకు చెందిన లోక్‌సత్తా నేత దాసరి ఇమాన్యుయల్ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై దర్యాప్తు జరిపించాలని, హైకోర్టు జోక్యం చేసుకోవాలని ఇమాన్యుయల్ లేఖ రాశారు. ఎపి ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్న నారాయణకు చెందిన కాలేజీలే ఎక్కువగా ఉన్నాయని, అలాంటి కాలేజీల్లో చదువుకున్న విద్యార్థుల ఆత్మహత్యలపై అక్కడి ప్రభుత్వం కమిటీ వేసిందని, ఆ కమిటీ ఇచ్చిన నివేదికపై ఎలాంటి సమాచారం లేదని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన కాలేజీల యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును ఇమాన్యుయల్ కోరారు.
కోడి పందాలు ఎందుకు ఆపలేకపోయారు?
సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలను ఎందుకు ఆపలేకపోయారంటూ హైకోర్టు సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కలిదిండి రామచంద్రరావు దాఖలు చేసిన ప్రజావాజ్య పిటీషన్‌ను స్వీకరించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ ఎం గంగారావులతో కూడిన డివిజన్ బెంచ్ ఈమేరకు అధికారులను ప్రశ్నించింది. పిటీషనర్ తరఫున న్యాయవాది పి వెంకటరెడ్డి వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరఫున విద్యావతి, జయంతిలు తమ వాదనలు వినిపించారు. హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, వాటిని పట్టించుకోరా అంటూ న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ నెల 29న ఎపి సిఎస్, డిజిపిలు హైకోర్టులో హాజరుకావాలని ఆదేశించారు. కోడి పందాలపై తీసుకున్న చర్యలను వివరిస్తూ సమగ్ర నివేదికతో రావాలని డిజిపి, సిఎస్‌లను హైకోర్టు ఆదేశించింది.