రాష్ట్రీయం

మార్చి 5కే జిల్లాలకు చేరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: మార్చి 11న రాష్టవ్య్రాప్తంగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేయడానికి అనుగుణంగా మార్చి 5 వరకే జిల్లాలకు పాసు పుస్తకాలు చేరాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్‌లో గురువారం రెవిన్యూ సంస్కరణలు, కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, ధరణి నిర్వహణపై రెవిన్యూ రంగారెడ్డి, మేడ్చేల్ జిల్లా కలెక్టర్లతో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, రెవిన్యూ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం గొప్పగా విజయవంతమైందని సీఎం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఇంచు భూమికి లెక్క తేలిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 93 శాతం భూములకు సంబంధించిన విషయంలో స్పష్టత వచ్చిందన్నారు. కోర్టు కేసు లు, ఇతర వివాదాల్లో
ఉన్న భూములకు సంబంధించిన వివరాలు పార్ట్-బిలో నిర్ణయం
జరుగుతుందన్నారు. పాసు పుస్తకాలు, పహాణీల్లోని ఇప్పటి వరకు పరభాషా పదాలు చాలా వాడటంతో పాటు ఎక్కువ కాలమ్స్ ఉన్నాయన్నారు. మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం అవేవి రైతులకు అర్థం కావని ముఖ్యమంత్రి అన్నారు. రైతులు వాడే పదాలనే పాసు పుస్తకాలు, పహాణీల్లో ఉపయోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. కొత్తగా జారీ చేయబోయే పాసు పుస్తకాలు, పహాణీల్లో రైతులు వాడే భాషాతోనే ముద్రించి ఇవ్వాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో భూ రికార్డుల సర్వే పూర్తి కావడంతో ఇకపై పట్టణ, నగర ప్రాంతాల్లోని భూ వివరాలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రైవేట్ ఆస్తులకు కూడా సర్వే నంబర్ల మాదిరిగా ప్రత్యేక నంబర్లు కేటాయించే విధానాన్ని తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత గ్రామాల్లో భూ వివాదాలు తగ్గిపోతాయని, ఇదే విధమైన వాతావరణం పట్టణాలు, నగరాల్లో కూడా నెలకొల్పడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో భూ భాగంపై ప్రతీ ఇంచుపై వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు.
ఐపిసి 506, 507 సెక్షన్లకు కోర్టు అనుమతి అక్కర్లేదు
ఐపిసి 506, 507 సెక్షన్ల కింద పేర్కొన్న నేరాలకు కోర్టు అనుమతి లేకుండానే విచారించదగిన నేరాలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం సంతకం చేసారు. ఈ సెక్షన్ల కింద పరుష పదజాలంతో బెదిరించడాన్ని నేరాలుగా పరిగణించబడుతాయి. అయితే ఈ నేరాల కింద కేసు నమోదుకు కోర్టు అనుమతి తీసుకోవాలా? లేక కోర్టు అనుమతి లేకుండానే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలా? అనే విషయం ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వ విచక్షణ కిందికి వస్తుంది. ఆయా రాష్ట్రాలే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, కోర్టు అనుమతి లేకుండానే కేసు నమోదు చేసి విచారణ చేపట్టే నేరంగా ప్రభుత్వం నిర్ణయించింది.

చిత్రం..ప్రగతి భవన్‌లో రెవిన్యూ సంస్కరణలు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, పహాణీల
తయారీపై రెవిన్యూ అధికారులతో చర్చిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్