రాష్ట్రీయం

నాది.. ప్రజాపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 27: ‘మీరు ఎవరి పక్షం అని చాలామంది అడుగుతున్నారు. అసలు రాజకీయాల్లో ఉంటారా? పారిపోతారా? అని కూడా అంటున్నారు. నేను ఏ పక్షమూ కాదు. నాది ప్రజాపక్షం. ఆఖరిశ్వాస ఉన్నంత వరకూ మీకు అండగా ఉంటాను’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో మూడు రోజుల రాజకీయ యాత్రకు శనివారం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తొలిరోజు నగరంలోని గుత్తి రోడ్డులో జనసేన పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాను ఓటు బ్యాంకు బ్యాంకు రాజకీయాలు, శవ రాజకీయాలు, మత రాజకీయాలు చేయనని ఆయన స్పష్టం చేశారు. ‘నేను నా తమ్ముళ్ల పక్షం, అక్కాచెల్లెళ్ల పక్షం, ఆడపడుచుల పక్షం.. అందుకని నేను కోరుకునేదల్లా మీరు నాకు అండగా ఉండండి.. నన్ను పని చేసుకోనివ్వండి.. సమస్యలపై నేను పోరాటం చేస్తాను’ అని అన్నారు. ప్రజలకు ఏది అవసరమో, ఏంచేస్తే మంచి జరుగుతుందో అదే చేస్తానన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నాయకులు సరిపోరని, చాలామంది కొత్తవారు కావాలన్నారు. త్రికరణశుద్ధిగా ప్రజాసమస్యలపై పోరాటం చేసే వారు కావాలి అని ఆయన అన్నారు. రాజకీయాల పట్ల తనకు ప్రేమ, బాధ్యత ఉన్నందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను నటించిన సినిమాలను మీరంతా ఆదరించారని, తనపై ఎంతో ఆదరణ, ప్రేమ చూపారని, అలాంటి మీకు ఏదైనా చేయాలని, ఎంతో కొంత ప్రజాసేవ
చేస్తేగానీ తృప్తిగా ఉండదని భావించే పార్టీ ప్రారంభించానన్నారు. గెలుపోటములపై తనకు పెద్దగా ఆసక్తి లేదన్నారు. తాను జీవిత ప్రయాణికుడినినని, ఏదైతే నమ్ముతానో, ఏదైదే ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నానో దానినే చిత్తశుద్ధితో చేస్తానని, ఎట్టి పరిస్థితుల్లోనూ మడమ తిప్పనని, మీకోసం జీవితాన్ని ధారపోస్తానని అన్నారు.
తాను రైతునని, రైతు కష్టం తెలిసిన వాడినని, స్వయంగా రైతును కూడా కావడంతో వారి సమస్యలు తెలుసని అన్నారు. అలాగే యువత ఆశయాలు తెలుసు, ఆడపడచుల బాధలు తెలుసు, కులాలు మతాలు, ప్రాంతాలకు అతీతంగా మనందరి బాధలు ఒక్కటేననీ తెలుసు..మీ సమస్యలు తీర్చేందుకే మీ ఇంటిలో బిడ్డగా, అన్నగా, ఓ తమ్ముడిగా వచ్చానని వివరించారు. మీ కష్టం నా కష్టం, కోరేదల్లా మీరు నాకు అండగా నిలవండి చాలు.. ఎవరైనా సరే నా పని నన్ను చేసుకోనివ్వండి.. అని విజ్ఞప్తి చేశారు. ఓటెయ్యండనో, పార్టీని గెలిపించడనో అడిగేందుకు రాలేదన్నారు. తాను ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేసుకుంటూ పోతానని, త్రికరణ శుద్ధిగా రాష్ట్రం కోసం, రాయలసీమ అభివృద్ధి కోసం పని చేస్తున్నానని అనిపిస్తే, మీకు అండగా ఉంటానని భావిస్తే సపోర్టు చేయండని, ఓటు వేయాలనిపిస్తే తడుముకోకుండా వేయండని విజ్ఞప్తి చేశారు. ఓటు వేసినా, వేయకున్నా మీకు అండగా ఉంటానని స్పష్టం చేశారు.
రాయలసీమ అంటే ఫ్యాక్షన్ నేల కనిపించదని, ముఠా తగాదాలు కనిపించవని అన్నారు. ఒక తరిమెల నాగిరెడ్డి, నీలం సంజీవరెడ్డి లాంటి వారు, సీమకవులు, కళాకారులు కనిపిస్తారని, సీమ ఆటపాట కనిపిస్తుందన్నారు. అంతేగానీ సినిమాల్లో చూపించినట్లు రాయలసీమను ముఠా తగాదాలకు నిలయంగా చూడను అని పవన్ కల్యాణ్ అన్నారు. రాయలసీమ అంటే అపరిమితమైన ప్రేమ ఉన్న వ్యక్తినని అన్నారు. సీమలో పుట్టకపోవచ్చు.. పునర్జన్మ ఇవ్వకపోవచ్చు కానీ, నా ప్రాణం ఉన్నంత వరకూ, నా ఆఖరిశ్వాస వరకు, మన గడ్డకూ, బతుక్కూ అండగా ఉంటానన్నారు. కరవు నేలగా కాదు, సస్యశ్యామలమైన నేలగా చూసే దాకా తోడుంటానని భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల గురించి తాను ఆలోచించడం లేదన్నారు. రానున్న పాతిక సంవత్సరాల వరకూ రాయలసీమ, మన జిల్లాలు, మన ప్రాంతాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
తాను అందరిలా రోడ్డెక్కనని, సమయం వృథా చేయనని పవన్ అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే.. అదీ మనమాట ఎవరూ వినరనే పక్షంలో రోడ్డుమీదికొస్తానని అన్నారు. అప్పటి దాకా ఎవరు ఏమన్నా వ్యక్తిగతంగా కూడా పట్టించుకోనని అన్నారు. బాధ్యతగా ఉంటానని, తన మీద ఎలాంటి దాడులు జరిగినా భయపడనని, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, చివరకు జైలులో పెట్టినా వెనక్కు తగ్గనని అన్నారు. తనపై పడే ప్రతి దెబ్బా మరింత రాటుదేలుస్తుందే గానీ, మడమ తిప్పనని అన్నారు.

చిత్రం..అనంతపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలుకుతున్న అభిమానులు