రాష్ట్రీయం

సుజల తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: తెలంగాణలో చేపడుతున్న మిషన్ కాకతీయ పథకం, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి భారీ ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సాగునీటి రంగంలో తెలంగాణ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు, చేపట్టిన పథకాలపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి శనివారం జలసౌధలవో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో 19 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రం అవతరించకముందు 80 వేల చిన్న నీటిపారుదల వనరులు ఉండగా, నగరీకరణ తదితర కారణాల వల్ల సగం చెరువులు కనుమరుగయ్యాయని జోషి వివరించారు. గొలుసు కట్టు చెరువులతో పాటు మొత్తం చిన్న నీటి వనరులను పరిరక్షించేందుకు వాటిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం మిషన్ కాకతీయ చేపట్టిందన్నారు. 46వేల చెరువులను పునరుద్ధరించేందుకు తీసుకుంటున్న చర్యల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. చెరువులను నమ్ముకున్న రజక, బెస్త, ముదిరాజులకు జీవన భృతి దొరుకుతుందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సాగునీటి అధికారులు వివరించారు. రూ.80వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగకా చేపట్టిందని జోషి చెప్పారు. 90 రోజుల పాటు రెండు టిఎంసి నీటిని ప్రతి రోజూ ఎత్తిపోయడానికి భారీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేపట్టామన్నారు. 18.26 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. మొత్తం 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. తాగునీటి అవసరాలకు 36, పారిశ్రామిక అవసరాలకు పది టిఎంసిలనీరు వాడుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా, ఇథియోఫియా, శ్రీలంక దేశాల ప్రతినిధులు అనేక సందేహాలు అడిగి తెలుసుకున్నారు. వార్షిక బడ్జెట్‌లో సాగునీటి రంగానికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నట్లు వారికి జోషి చెప్పారు.