రాష్ట్రీయం

శ్రీశైలం ప్రాజెక్టు నీటి అడుగున సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం ప్రాజెక్టు, జనవరి 30: దేశంలో మూడవ అతిపెద్ద హైడ్రాలిక్ ప్రాజెక్టు శ్రీశైలం డ్యాం దిగువన ఫ్లంజ్‌ఫుల్ వద్ద ఏర్పడిన గొయ్యి గురించి ప్రాజెక్టు అడుగున అధికారులు సర్వే చేపట్టారు. 1994లో ఈ గొయ్య 60 అడుగులుగా ఉందని నిపుణులు గుర్తించారు. తరువాత 1999, 2009లో వచ్చిన భారీ వరదలకు గొయ్యి 96 అడుగులకు చేరుకున్నట్టు గోవాకు చెందిన జాతీయ సముద్ర పరిజ్ఞాన సంస్థ ప్రతినిధులు నీళ్లలోదిగి అండర్ వాటర్ వీడియోగ్రఫీతో 2012లో గుర్తించారు. గొయ్యికి మధ్యదూరం 6,7 క్రస్ట్‌గేట్ల వద్ద దిగువ డ్యాంకు 200మీటర్ల దూరంలో 98 అడుగుల గొయ్యి ఏర్పడిందని నివేదికను రాష్ట్ర ఇరిగేషన్ శాఖకు, కేంద్ర వాటర్ కమిషన్‌కు అందచేశారు. దీనికి మరమ్మతులు చేయకుంటే భవిష్యత్‌లో డ్యాంకు ప్రమా దం తప్పదని వారు సూచించారు. ఆ సర్వేల ఆధారంగా ప్రాజెక్టు నిర్వాహణ బాధ్య త చూస్తున్న ఏపి ప్రభుత్వం తిరిగిరీ సర్వేకు రూ.36లక్షలను విడుదల చేసింది. మం గళవారం నుంచి విశాఖపట్టణంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన నిపుణులు అత్యంత ఆధునిక యంత్రాలతో నీటి అడుగున గొయ్యి పొడవు, వెడల్పు, ఎత్తులను పరిశీలిస్తున్నారు. ఈ సర్వే ఐదురోజుల పాటు కొనసాగనున్నట్టు అధికారులు తెలిపారు. ఫ్లంజ్‌ఫుల్ దిగువన నిర్వహణ బాధ్యతలను పట్టించుకోకపోవడంతో డ్యాంకు ప్రమాదం ఉందన్న అభిప్రాయాలపై డ్యాం సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్లికార్జునరెడ్డి వివరణ ఇస్తూ డ్యాం భద్రతపై ప్రస్తుతానికి ఎలాంటి అనుమానాలు అవసరంలేదని, ఎప్పటికప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రాజెక్టు నిపుణులతో పరిశీలిన చేయిస్తున్నామని, ఇప్పుడువచ్చే నిపుణుల సర్వే నివేదికతో ప్రభుత్వానికి నివేదికలను పంపించి ఫ్లంజ్‌ఫుల్ ఏరియాలో పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు.