రాష్ట్రీయం

రైతురుణాలపై వ్యాపార కోణం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: రైతులకు ఇచ్చే రుణాలను వ్యాపార కోణంలో చూడవద్దని, వారికి అండగా నిలవడమంటే దేశానికి సేవ చేయడమేనని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇక్కడ మంగళవారం నాబార్డు ఆధ్వర్యంలో జరిగిన ‘స్టేట్ క్రెడిట్ ప్లాన్’ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, టి హరీశ్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, రైతు వ్యాపారి కాదు గనుక అతనికిచ్చే రుణాలను లాభనష్టాలతో బేరీజు వేయరాదన్నారు. చాలామంది రాజకీయ నేతలు రైతుల గురించి గొప్పగా చెప్పడమే తప్ప వారి బాగోగులను ఆలోచించడం లేదన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే రైతు కోసం నిరంతరం తపన పడుతున్నారని అన్నారు. కర్షకులు అప్పులపాలు కాకుండా తమ ప్రభుత్వం ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తుందన్నారు. నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు మాట్లాడుతూ, భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి కావడంతో రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇచ్చేలా బ్యాంకర్లు పాత పాస్ పుస్తకాలను తిరిగి ఇచ్చేయాలని సూచించారు. పాసు పుస్తకాలను తనఖా పెట్టుకుని రుణాలు ఇచ్చే విధానానికి స్వస్తి పలికి రైతుల భూ వివరాలను బ్యాంకుల్లో ఆన్‌లైన్‌లోనే పరిశీలించి రుణాలు ఇవ్వాలని మంత్రి సూచించారు. పంట రుణాలపై లక్ష్యాలను కొన్ని బ్యాంకులు పూర్తి చేయడం లేదని హరీశ్‌రావు అసంతృప్తి వ్యక్తం చేసారు. నాబార్డు రూపొందించిన 2018-19 రుణ విధాన పత్రాన్ని మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా విడుదల చేశారు.

చిత్రం..నాబార్డు ఆధ్వర్యంలో స్టేట్ క్రెడిట్ ప్లాన్ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు