రాష్ట్రీయం

అవకాశాలు పుష్కలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 30: లాస్‌ఏంజల్స్‌లో నిర్వహిస్తున్న పెట్టుబడుల రోడ్ షోలో భాగంగా మంగళవారం అక్కడి వివిధ తెలుగు కంపెనీల సీఈవోలతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. అమెరికా పర్యటనలో మంత్రి గత కొద్ది రోజులుగా ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులతో పాటు అమెరికా వచ్చే తెలుగు వారికి నైపుణ్య శిక్షణ అందించాలని పిలుపునిచ్చారు. తొలుత పీబీ సిస్టమ్స్ కంపెనీ సీఈవో వేణు గార్నేనితో జరిగిన సమావేశంలో ఏపీలో హెల్త్‌కేర్, టెలీ మెడిసిన్‌లో అవకాశాలు ఉన్నాయని, కార్యకలాపాలు విస్తరించాలని కోరారు. సెంటా మెడ్, ప్రెస్ మార్ట్ డిజిటల్ మీడియా కంపెనీ సీఈవో విక్రమ్ తొర్పునూరి మాట్లాడుతూ ఏపీలోని పాలసీలు, రాయితీలపై అధ్యయనం
చేస్తున్నామని, త్వరలోనే పూర్తిస్థాయి ప్రతిపాదనలతో ఏపీకి వస్తామని మంత్రికి తెలిపారు. ఇండియాలో విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు. ఐస్పేస్ సీఈవో రాజేష్ కొత్తపల్లితో జరిగిన సమావేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పాలసీలు, రాయితీలు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. విశాఖలో కంపెనీ ప్రారంభించాలని అనుకుంటున్నామని రాజేష్ తెలిపారు. ఏపీలో తమ కార్యకలాపాలు విస్తరించాలని, గుంటూరులో తమ యూనిట్ ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సాఫ్ట్ హెచ్క్యూ సీఈవో క్రాంతి పొన్నం వివరించారు. కాగిత రహిత పాలన తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని, కంపెనీ ఏర్పాటుకు కావాల్సిన సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. అడ్వాన్స్‌డ్ బ్యాటరీ సిస్టమ్స్ కంపెనీ సీఈవో రిచర్డ్ కెయిన్, వైస్ ప్రెసిడెంట్ మైక్ పాలోమీరాను మంత్రి కలిసి, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగం పెంచడానికి నూతన పాలసీలు తీసుకొస్తున్నట్లు వివరించారు. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలు వాడబోతున్నామని, లిథియం ఐయాన్ బ్యాటరీ తయారీలోని అడ్వాన్స్‌డ్ బ్యాటరీ సిస్టమ్స్ తయారీ రంగాన్ని, ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహిస్తున్నామని లోకేష్ తెలిపారు. కెయిన్ మాట్లాడుతూ త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి, మార్కెట్ అంచనా, పాలసీలు, రాయితీలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇండియాలో బ్యాటరీ తయారీ కంపెనీ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, ఏపీలో కంపెనీ ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కంపెనీ ఏర్పాటుకు కావాల్సిన సహకారం అందిస్తామని వారికి మంత్రి హామీ ఇచ్చారు. వీఎం వేర్ సీవోవో రఘు కాజాంచితో మంత్రి చర్చించారు. అమెజాన్, గూగుల్ ఇండియా క్లౌడ్ కంపెనీలను ఏపీకి తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నామని మంత్రి తెలిపారు. టెక్నాలజీ అనుసంధానంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని, వివిధ శాఖల సమాచారాన్ని అనుసంధానం చేస్తున్నామని కాజాంచికి వివరించారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, త్వరలోనే ఏపీకి వచ్చి అధ్యయనం చేస్తామని కాజాంచి స్పష్టం చేశారు.

చిత్రం..లాస్‌ఏంజెల్స్‌లో తెలుగు సీఈవోలతో మంత్రి లోకేష్