రాష్ట్రీయం

జనం మెచ్చితేనే ఫలితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 30: ‘మనం ప్రజలకు కావలసిన అన్ని పనులు చేశాం. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పని చేస్తూనే ఉన్నాం. కానీ మీ ప్రవర్తన, పనితీరులోనే మార్పు రావాలి. మీరు మారారన్న సంకేతాలు కనిపించాలి. దానిని ప్రజలు గుర్తించాలి. మన ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి సానుకూలత ఉంది. దాన్ని ఓటుగా మలుచుకునే బాధ్యత మీదే. మీరుండే గ్రామాలతోపాటు, పార్టీ కూడా అభివృద్ధి చెందాలి. ఆ కోణంలో పనిచేయండి. మనకు ప్రజల సంతృప్తే ముఖ్యం. దాన్ని ఎంత పెంచితే మనకు అంత భవిష్యత్తు ఉంటుంద’ని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. మంగళవారం నిర్వహించిన పార్టీ-ప్రభుత్వ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘మనం ఎన్నికలకు ఇంకా ఏడాదిలో ఉన్నాం. ప్రభుత్వ కార్యక్రమాల వల్ల లబ్థిపొందిన వారిని సానుకూలంగా మార్చుకోవాలి. దానికోసం మీరంతా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. దానికోసం ఎక్కడికక్కడ యాక్షన్‌ప్లాన్ రూపొందించుకోండి’ అని బాబు సూచించినట్టు తెలుస్తోంది. ప్రజల్లో గత నెల వరకూ 57 శాతం సంతృప్తి శాతం ఉందని, ఈ నెలలో అది 62 శాతానికి పెరిగిందని చెప్పారు. పెళ్లికానుకలు ఇస్తున్నందున వచ్చే నెలలో ఆ శాతం మరో 4కు, మార్చిలో ఇంకో 10 శాతానికి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అన్న
యాంటీన్లతో మరో 10 శాతం పెరుగుతుందని, ఆ విధంగా అన్ని పథకాలు కలిపి మొత్తం 80 శాతం లక్ష్యానికి చేరుకునే వరకూ అహర్నిశలు కష్టించాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండంకెల వృద్ధిరేటును ఎకనామిక్ సర్వే కూడా గుర్తించిందని, పర్యాటక రంగంలో రాష్ట్రం తృతీయ స్థానంలో ఉండటం ప్రగతికి సూచిక అన్నారు. ‘నేను కష్టాన్ని నమ్ముతాను.మనం కష్టపడితే ఫలితాలు అవే వస్తాయి. కష్టపడకపోతే ఏమీ సాధించలేం’ అని వ్యాఖ్యానించారు.
‘మీరంతా మీమీ గ్రామాలు అభివృద్ధి చెందాలనే తపనతో పనిచేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పనులు చేయిస్తున్నారు. మంచిదే. కానీ అదే సమయంలో పార్టీ కూడా మీమీ గ్రామాల్లో అభివృద్ధి చెందాలి. అంతే పట్టుదలతో పార్టీని విస్తరించాలి. అభివృద్ధి-సంక్షేమం-పార్టీ పురోగతి ఈ మూడూ ఒకేక్రమంలో సాగినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని’ అని బాబు స్పష్టం చేశారు.
జన్మభూమి కమిటీలలో మార్పులు చేసుకోవాలని, ఎవరైనా పనిచేయడం లేదని భావించినా, ఎవరి వల్లయితే పార్టీకి చెడ్డపేరు వస్తుందని భావించినా వారి స్థానంలో కొత్తవారిని నియమించుకోవాలని, ఆ మేరకు ఉత్తర్వులు కూడా ఇచ్చామన్నారు. దళిత తేజం-తెలుగుదేశం కార్యక్రమాన్ని ఇంటింటికీ తెలుగుదేశం అంత సీరియస్‌గా తీసుకుని పనిచేయాలని, ప్రతి ఒక్కరూ ప్రతి దళిత కుటుంబం తలుపు తట్టాల్సిందేనన్నారు. దళితులకు మనం చేసినన్ని పనులు మరెవరూ చేయలేదని, ఇకపై చేయబోరన్నారు. అదే సమయంలో బీసీ, మైనారిటీ, ఎస్టీ వర్గాలతో కలసి కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు.
పార్లమెంటు ఇన్చార్జి మంత్రులు ప్రతినెలలో నాలుగైదు రోజులు తప్పని సరిగా ఆయా సెగ్మెంట్లపై దృష్టి సారించాలని, అందరితో సమన్వయం కుదర్చాలన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించేవారిని ఉపేక్షించేవారిని సహించేది లేదని హెచ్చరించారు. మీరు మారారని, మీలో మార్పు వచ్చిందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని స్పష్టం చేశారు. మండల స్థాయి నేతలను కూడా పార్లమెంటు నియోజవకర్గాల సమన్వయ కమిటీ సమావేశాలకు పిలవాల్సిందేనని మంత్రులను ఆదేశించారు. ఇకపై తాను అన్ని నియోజకవర్గాల పరిస్థితిని సమీక్షిస్తానని, ముఖ్యంగా సీ,డీ కేటగిరిలపై తాను సీరియస్‌గా దృష్టి సారిస్తానని, వారు ఏ,బీ కేటగిరికి చేరే వరకూ పరిగెత్తిస్తానని చెప్పారు.