రాష్ట్రీయం

శివాలెత్తుతున్న మేడారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం, జనవరి 30: మంచుదుప్పటి పరచుకున్న మేడారం.. మాఘ పున్నమి వేళ పులకరిస్తోంది.. మహాతల్లుల జాతర ఘడియ సమీపించడంతో వీరత్వాన్ని పులుముకుని శివాలెత్తుతోంది.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కీకారణ్యంలో రెండేళ్లకోమారు జరిగే సమ్మక్క- సారలమ్మ జాతర నేడు (బుధవారం) శ్రీకారం చుట్టుకోబోతున్నది. ఇప్పటికే 20లక్షలమందికి పైగా భక్తులు అమ్మవార్లను ముందస్తుగా దర్శనం చేసుకోగా ఐదు రాష్ట్రాలకు చెందిన మరికొన్ని లక్షల మంది ఎదనిండా భక్తిప్రపత్తులతో..గద్దెను చేరే తల్లుల రాకకోసం నిరీక్షిస్తూ మేడారం చేరుకుంటున్నారు. ‘సమ్మక్క..సారలమ్మ తల్లులూ మా కష్టాలు ఈడేర్చి సల్లంగా చూడండంటూ’ భక్తజనం చేసే ప్రార్థనలతో మేడారం ప్రతిధ్వనిస్తోంది. శివసత్తుల పూనకాలతో కీకారణ్యం ఊగిపోతోంది. అన్ని దారులూ మేడారం వైపే సాగుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ జాతర మహా కుంభమేళాను తలపిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చతీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కోటిమందికిపైగా భక్తులు జాతరకు వస్తారని భావిస్తున్న రాష్ట్రప్రభుత్వం 85కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాట్లను
చేసింది. రాష్టవ్య్రాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులను తరలించేందుకు ఆర్టీసీ 4200 బస్సులను ఏర్పాటు చేసింది. ఈసారి ప్రత్యేకంగా హైద్రాబాద్, వరంగల్ నుంచి రాజధాని, ఇంద్ర, వజ్ర తదితర ఏసీ బస్సులను కూడా నడుపుతోంది. గత మూడురోజులుగా మేడారానికి తరలివచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వన్-వే అమలు చేస్తున్నారు. జాతర ప్రాంతంలో బందోబస్తు కోసం భూపాలపల్లి జిల్లాతోపాటు వివిధ జిల్లాల నుంచి ఎస్పీ, అదనపు ఎస్పీ, డిఎస్పీ, సిఐ స్థాయి అధికారులతోపాటు మొత్తం 10వేలమంది సిబ్బంది విధులు నిర్వహించేందుకు తరలివచ్చారు. భక్తులకు అవసరమైన స్నాన ఘట్టాలు, మరుగుదొడ్డుల, తలనీలాలు సమర్పించుకునే షెడ్లు, మంచినీటి సదుపాయం, గద్దెల ప్రాంతంలో భారీసంఖ్యలో బారికేడ్లు ఏర్పాటుచేసారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రైవేటు వాహనాల కోసం పలుచోట్లు పార్కింగు పాయింట్లు కూడా ఏర్పాటుచేసారు. అమ్మవార్ల దర్శనం కోసం వస్తున్న భక్తజనం చెట్టూ, పుట్టా కాస్త ఖాళీ కనిపించినా, ఎక్కడ చూసినా జనం చేరిపోతున్నారు. మంగళవారం సాయంత్రానికే మేడారం కీకారణ్యం జనారణ్యంగా మారిపోయింది.
నేడు గద్దెను చేరనున్న సారలమ్మ
మేడారం జాతర బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెను చేరటం ద్వారా శ్రీకారం చుట్టుకుంటుంది. నాలుగురోజుల ఈ జాతర పర్వంలో ప్రధాన ఘట్టం సమ్మక్క గద్దెను అదిష్టించడమే.. తొలిరోజు బిడ్డ సారలమ్మ గద్దెకు రానుండగా..గురువారం తల్లి సమ్మక్కను గద్దెకు చేరుస్తారు. కుంకుమభరిణెల రూపంలో దర్శనమిచ్చే ఇద్దరు మహాతల్లులు కొలువుదీరిన ఆ క్షణం జాతరలో అపురూప ఘట్టంగా భావిస్తారు. కనె్నపల్లినుండి సారలమ్మను.. చిలుకలగుట్ట నుండి సమ్మక్కను గిరిజన పూజారులు సాంప్రదాయ పద్దతిలో తోడ్కొని వస్తారు. అమ్మలు కొలువుదీరిన ఆ దృశ్యాన్ని లక్షలాదిమంది భక్తులు తమ ఎదనిండా నింపుకుని పరవశించిపోతారు. జాతరలో మూడోరోజు శుక్రవారం భక్తజనం తమ మొక్కులు సమర్పించుకుంటారు. లక్షలాది కోళ్లు, మేకలను అమ్మలకు బలి ఇస్తారు. చివరిరోజు అమ్మల వనప్రవేశంతో మహాజాతర ముగుస్తుంది.
నిలువెత్తు బంగారమే..
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఇతర అన్ని జాతరలకు భిన్నంగా జరుగుతుంది. తమ కొంగుబంగారంగా భావించే మహాతల్లులకు భక్తులు తమ నిలువెత్తు ‘బంగారం’ సమర్పించుకోవడమే ఈ జాతర విశిష్టత. బెల్లంను భక్తులు బంగారంగా భావిస్తారు. తమ కష్టాలు ఈడేర్చిన తల్లులకు తమ నిలువెత్తు బెల్లంను మొక్కుగా ఇవ్వడం అనాదినుండి ఆచారంగా వస్తోంది. బండారి (పసుపు)తోపాటు బెల్లంను అందచేస్తారు.
శుక్రవారం ఉపరాష్టప్రతి, సీఎం కేసీఆర్ రాక
సమ్మక్క-సారలమ్మ తల్లులు గద్దెలపై కొలువుదీరాక మొక్కులు చెల్లించుకునే శుక్రవారం ఉపరాష్టప్రతి ఎం. వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మేడారం వస్తున్నారు. ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు, తెలంగాణ ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ జాతరకు రావడం ఇదే తొలి సారి. ఉద్యమ సమయంలో మేడారంలో మొక్కులు చెల్లించుకున్న కేసీఆర్ 2016లో జరిగిన జాతరకు హాజరుకాలేదు. ఈ పర్యాయం జాతరకు వచ్చి ప్రభుత్వ పక్షాన మొక్కు చెల్లించుకునేందుకు సీఎం నిర్ణయించుకున్నారు. కుటుంబ సమేతంగా సీఎం జాతరకు వస్తున్నారు. కేంద్ర గిరిజన సంక్షేమశాఖమంత్రి కూడా మేడారం జాతరకు హాజరవుతున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.