రాష్ట్రీయం

ఆక్వా సాగుపై వివరణ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: తెలంగాణలో కల్తీ పాల విక్రయాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాల్సిందిగా హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. నల్లగొండ జిల్లాకు చెందిన కె నరసింహారావుదాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. ఈ పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం ఈ పిల్‌ను విచారించింది. పాలలో ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నారని, దీని వల్ల బాలలు, పెద్దలో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వానికి నోటీసులు
ఆంధ్రాలో సారవంతమైన భూములను చేపలు,రొయ్యల పెంపకానికి చెరువులుగా మారుస్తున్నారంటూ హైకోర్టు రిటైర్డు జడ్జి ఇ ధర్మారావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. ఈ పిల్‌పై స్పందించాల్సిందిగా హైకోర్టు ధర్మాసనం ఏపి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
కోడిపందేల నిర్వహణపై పిల్

హైదరాబాద్, జనవరి 30: హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి గుంటూరు జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కోడిపందేలను నిర్వహించారని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదంటూ గుంటూరుకు చెందిన న్యాయవాది టి భాను ప్రకాశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు ఈ విషయమై ఇప్పటికే విచారణలో ఉన్న పిల్‌కు ఈ పిటిషన్‌ను జతపరచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి ఆదేశాలు జారీ చేశారు.