రాష్ట్రీయం

మొత్తం ఖర్చు మీరే భరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరించాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక విజ్ఞప్తి చేసింది. బుధవారం మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నేతృత్వంలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక నాయకులు మాజీ ప్రధాని మాన్మోహన్ సింగ్‌ను కలిశారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల అమలు కాని విషయాన్ని మన్మోహన్ దృష్టికి తెచ్చారు. కాగా పార్లమెంట్‌లో విభజన హామీలపై లేవనెత్తుతామని మాజీ ప్రధాని హామీ ఇచ్చారని ఆ నాయకులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు, ఎంపీ కొత్తపల్లి గీత తదితరుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలని కోరారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిర్వసితులకు పునరావసనం కల్పించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం కొణతాల విలేఖరుతో మాట్లాడుతూ డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ను ప్రైవేటీకరణ ఆపాలని గడ్కరీని కోరినట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వసితులకు భూసేకరణ, పరిహారం ఖర్చులు పూర్తిగా కేంద్రమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టు భూ సేకరణ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ప్రతిపాదనలు అందలేదని కేంద్రమంత్రి గడ్కరీ తమకు చెప్పారని కొణతాల వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందిన తర్వాత కేంద్ర కేబినేట్‌లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి అన్నారని ఆయన పేర్కొన్నారు. 2018 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రమంత్రి చెప్పారని, ఇంకా 11 నెలల కాలం మాత్రమే మిగిలి ఉందని, ఎలా ప్రాజెక్టు పూర్తిచేస్తారో వారికే తెలియాలని కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. అనంతరం అరకు ఎంపీ కొత్తపల్లి గీత మాట్లాడుతూ పోలవరం ముంపు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి వచ్చి సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నమని ఎంపీ కొత్తపల్లి గీత చెప్పారు.
బేరసారాలు మాకు అనవసరం: కేవీపీ
పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ల మార్పు, కమిషన్ల బేరసారాలను తాము పట్టించుకోబోమని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఎవరి వాటా ఎంత అన్నది తేల్చుకుని, నిర్మాణం పూర్తిచేస్తే చాలన్నారు. ప్రజాధనం వృధా అవడాన్ని ఎవరూ ఆపలేమని ఆయన చెప్పారు. ఆంధ్రా ప్రజల ఆకాంక్ష పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే మాముందున్న లక్ష్యమని, ప్రాజెక్టు ఎన్డీయే ప్రభుత్వంవల్ల కాకుంటే తమ ప్రభుత్వం వచ్చాక పూర్తిచేసి చూపిస్తామని రామచందర్‌రావు తెలిపారు.