రాష్ట్రీయం

మార్చి 26న శ్రీరామనవమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జనవరి 31: శ్రీ రామచంద్రుడు విళంబి నామ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్ర యుక్త కర్కాటక లగ్నంలో జన్మించాడు. చైత్రశుద్ధ నవమినే శ్రీ రామనవమిగా భావిస్తూ స్వామి పుట్టిన రోజునే భద్రాద్రిలో కల్యాణం జరిపించడం ఆనాదిగా ఆనవాయితీగా వస్తోంది. యస్చావతార సమయ:తత్స కల్యాణ మాచరేత్ (ఏ దేవుని అవతార సమయమో ఆ రోజున ఆ దేవుని కల్యాణాన్ని ఆచరించాలి) అన్న పాంచ రాత్రాగమ సంప్రదాయం ప్రకారం శ్రీ రామ నవమి నాడే శ్రీ సీతారాముల కల్యాణం జగత్ కల్యాణం కోసమే జరిగిందని పెద్దలు చెబుతారు. స్వామివారి కల్యాణం ఏటా మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత అభిజిత్ లగ్నంలోనే చేయడం ఆనవాయితీ. ‘సూర్యాచ్ఛతర్థుం యల్లగ్న మభిజిత్సంజ్ఞకంచతమ్. సర్వేదేశిష్విదం ముఖం. సర్వ వర్గేషు చదుర్లభమ్’ అంటారు. సూర్యుడు ఉన్న రాశి నుంచి నాల్గవ లగ్నం ఏ లగ్నమవుతుందో ఆ లగ్నాన్ని అభిజిత్ లగ్నమని పిలుస్తారు. సర్వదేశములు, సర్వవర్గములు, ఎల్లప్పుడు శుభకార్యాలను ఈ లగ్నంలోనే అచరించవచ్చు. ఇలా శ్రీరాముడికి జరిగే కల్యాణ వైభోగంలో అచారాలు, ఆనవాయితీలు ఉన్నాయి. అయితే ఈసారి భద్రాద్రిలో జరిగే శ్రీ రామనవమి సీతారాముల కల్యాణ మహోత్సవం కూడా ఒక సరికొత్త ప్రత్యేకత సంతరించుకోనుంది. పుట్టిన రోజే ఏటా భద్రాద్రిలో సీతమ్మను పరిణయమాడే శ్రీరాముడు ఈసారి తాను పుట్టిన ఏడాది కల్యాణ రాముడిగా కనిపించనున్నారు. అరుదుగా వచ్చే ఈ సందర్భంగా 60 ఏళ్ల తర్వాత ఈ ఏడాది శ్రీరామనవమికి ఆవిష్కృతం కానుంది. మార్చి 18నుంచి భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా అదేరోజు ఉగాది నుంచి విళంబిలోకి తెలుగువారంతా అడుగుపెట్టనున్నారు. శ్రీరామచంద్రుడు కూడా విళంబి నామ సంవత్సరంలోనే జన్మించడంతో ఈసారి జరిగే కల్యాణానికి ఈ ప్రత్యేకత ఉంది. చివరిగా 1958లో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకోగా తిరిగి 60 ఏళ్లకు భక్తులకు ఈ భాగ్యం దక్కనుందని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తెలిపారు.
మార్చి 26న శ్రీరామనవమి
దేశంలో శ్రీరామ నవమి తేదీకి కొలమానం భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వైదిక కమిటీదే. ఈసారి మార్చి 26న తేదీన శ్రీ రామనవమి శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించాలని దేవస్థానం వైదిక కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు సీతారామచంద్రస్వామి వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మార్చి 18న ఉగాది వేళ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా మార్చి 22న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 23న ధ్వజపట భద్రక మండల చిత్ర లేఖనం, 24న అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, 25న ఎదుర్కోలు, 26న శ్రీరామనవమి, 27న మహాపట్ట్భాషేకం, 28న సదస్యం, 29న చోరోత్సవం, 30న ఊంజల్ సేవ, 31న వసంతోత్సవం, ఏప్రిల్ 1న చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ అర్చకులు వివరించారు.