రాష్ట్రీయం

కడప కోర్టు గేటుకు తాళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఫిబ్రవరి 1: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుచేయాలంటూ ఆందోళన చేపట్టిన కడప న్యాయవాదులు గురువారం ఏకంగా జిల్లా కోర్టు గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. జడ్జీలు, కోర్టు సిబ్బంది, కక్షిదారులను గేటు బయటే అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. అదే సమయంలో విధులకు హాజరయ్యేందుకు వచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ వాహనాన్ని అడ్డుకున్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసమూర్తి, ఫ్యామిలీ కోర్టు జడ్జి ప్రసాద్ సైతం లోపలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. న్యాయవాదులంతా ముక్తకంఠంతో ‘హైకోర్టు రాయలసీమలో స్థాపించాలి’, ‘హైకోర్టు రాయలసీమ హక్కు’ అంటూ నినాదాలు హోరెత్తించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ వాహనం దిగి వినతిపత్రాన్ని తీసుకున్నారు.

చిత్రం..కడప కోర్టు గేట్లకు తాళం వేసి ఆందోళన చేస్తున్న న్యాయవాదులు