రాష్ట్రీయం

మారకపోతే ఉద్యమమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఫిబ్రవరి 1: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మూడున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ప్రధాన సమస్యను పరిష్కరించకుండా ఆర్థికేతర సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం దాటవేత ధోరణిని ప్రదర్శిస్తోందని, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించకపోతే ఉద్యమం తప్పదని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో గురువారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ కొత్త పీఆర్సీ ఏర్పాటుతో పాటు పాత పీఆర్సీ బకాయిలు, హెల్త్ కార్డుల అమలు, కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో సమావేశమైన ప్రతిసారీ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రులు విభజన కష్టాలను సాకుగా చూపుతూ సమస్యలను పక్కదారి పట్టిస్తూ వస్తున్నారన్నారు. ఇప్పటివరకూ తాము కూడా ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకున్నామన్నారు. అయితే మరికొద్దికాలంలో ప్రభుత్వం ఎన్నికల మూడ్‌లోకి వెళ్ళిపోతుందని, ఆ సమయంలో ఉద్యమాన్ని నిర్వహిస్తే కేవలం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే అనే అపవాదును మోపుతారన్నారు. ఉద్యోగ సంఘాలన్నీ సమస్యలపై పోరాడేందుకు ముందుగానే మేల్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతి ఎన్జీవో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ గడువు రెండు నెలలు గడుస్తున్నా నేటివరకూ సమాధానం రాలేదని అశోక్‌బాబు అన్నారు. తక్షణమే ఉద్యోగుల సమస్యలపై స్పందించకపోతే రెండురోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తమ డిమాండ్లతో నోటీసు ఇస్తామన్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని కేంద్రం ప్రభుత్వ అంశంగా చూపుతూ దాటవేత ధోరణిని ప్రదర్శిస్తోందన్నారు.
11వ పీఆర్సీని తక్షణమే నియమించాలని, నూరు శాతం హెల్త్‌కార్డుల అమలుకు చర్యలు తీసుకోవాలని, హెల్త్‌కార్డుల అమల్లో ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్య వైఖరిపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

చిత్రం..అమలాపురంలో విలేఖరులతో మాట్లాడుతున్న ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు