రాష్ట్రీయం

జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ ఆదిత్యనాథ్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: జగన్ అక్రమాస్తుల కేసులో నాలుగు వారాల పాటు సీనియర్ ఐఎఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్‌పై అభియోగాలను సిబిఐ కోర్టు విచారించకుండా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో ఆదిత్యనాథ్ దాస్‌కు ఊరట లభంచినట్లయింది. అక్రమాస్తుల కేసులవో ఇడి అభియోగాలను మోపింది. ఈ కేసును జస్టిస్ షామీమ్ అక్తర్ విచారించారు. తనకు ఈ అభియోగాల నుంచి విముక్తి కల్పించాలని, అభియోగాలను కొట్టివేయాలని ఆదిత్యనాథ్ దాస్ కోర్టును అభ్యర్థించారు. సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో రెండు వారాల్లో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఇడిని హైకోర్టు ఆదేశించింది.
టీటీడీ రూల్ 9ని తొలగించాలి
హైకోర్టులో హిందూయేతర ఉద్యోగుల పిటిషన్
తిరుమల దేవస్థానం పరిధిలో పనిచేస్తున్న 36 మంది హైందవేతర ఉద్యోగులు టిటిడి ఉద్యోగుల సర్వీసు రూల్స్‌లో 9 (4) ప్రకారం హైందవేతర ఉద్యోగులు పనిచేయడాన్ని నిషేధించే నిబంధనను తొలగించాలని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. టిటిడి స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థని, రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో టిటిడి పనిచేయడం లేదన్నారు. టిటిడిలోని వేరువేరు సంస్థల్లో 1998 నుంచి 2005 మధ్య అనేక ఉద్యోగాల్లో తాము నియమితులయ్యామన్నారు. తమకు జనవరి 11వ తేదీన షోకాజ్ నోటీసును టిటిడి కార్యాలయం జారీ చేసిందన్నారు. ఈ నోటీసులపై స్టే ఇవ్వాలని, రూల్‌ను అక్రమమని ప్రకటించాలని వారు కోర్టును అభ్యర్థించారు.