రాష్ట్రీయం

బిసి జాబితాలో ఏ కులాన్ని చేర్చినా ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: బిసి జాబితాలోకి ఇప్పటికే 140 కులాలు చేరటంతో ఆశించిన ప్రయోజనాలు చేకూరనందున ఇక ఏ ఒక్క కులాన్ని కూడా చేర్చినా సహించేది లేదంటూ బిసి జనసభ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జి.గంగాధర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బిసి సంఘాలన్నింటితో సంయుక్త కార్యాచరణ కమిటీని ఏర్పాటుచేసి పోరాటాలు సాగించబోతున్నామని ఆయన వెల్లడించారు. బిసి జనసభ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో జరిగిన రాష్టస్థ్రాయి సమావేశంలో వివిధ జిల్లాలకు చెందిన వివిధ కుల సంఘాల నాయకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. విస్తృతమైన చర్చలనంతరం అనేక తీర్మానాలను ఆమోదించటం జరిగింది. అనంతరం డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ 1973లో బిసి జాబితాలో కేవలం 87 కులాలుండగా 25 శాతం రిజర్వేషన్లున్నాయని ప్రస్తుతం కులాల సంఖ్య 140కి చేరినప్పటికీ రిజర్వేషన్ శాతం మాత్రం ఒక్క పాయింటు కూడా పెరగలేదన్నారు. దీనివలన బిసి వర్గాలకు అంతులేని అన్యాయం జరుగుతున్నదన్నారు. కాపులకే కాదు అగ్రవర్ణాల్లోని ఏ పేదవానిపట్ల కూడా తమకు వ్యతిరేకత లేదని అందరికీ న్యాయం జరగాలంటే 2011లో ప్రభుత్వ జరిపిన జనగణనను ఆసరాగా తీసుకుని ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం... ఉన్నత స్థాయిలో వున్నవారిని పక్కనబెట్టి క్రీమిలేయర్ విధానంలో రిజర్వేషన్లు అమలు జరిగినప్పుడే అన్ని కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. అలా కాకుండా వత్తిళ్లకు లొంగి రిజర్వేషన్లకు పూనుకుంట ప్రజల్లో వైషమ్యాలు పెరిగి ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని రోడ్డెక్కే పరిస్థితి దాపురిస్తుందంటూ డాక్టర్ గంగాధర్ హెచ్చరించారు.త్వరలో బిసి సంఘాలతో జెఎసి ఏర్పాటుచేసి కమిషన్ ఎదుట బలమైన వాదన వినిపించటమే గాక న్యాయపోరాటం కూడా సాగిస్తామన్నారు. ఉద్యమాలు అన్నీ కూడా జెఎసి ద్వారానే జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో బిసి ఐక్యవేదిక గౌరవాధ్యక్షుడు కె.చాంద్, యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పట్టెబోయిన మాలకొండయ్య, నగరాల సంఘ నాయకుడు పోతిన వెంకటేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా జెఎసి చైర్మన్ పి.సూర్యనారాయణ, ఎస్‌ఎస్ యాదవ్ (నెల్లూరు), రజక సంఘ నాయకులు బి.వీరబ్రహ్మం పాల్గొన్నారు.

శరవేగంగా పోలవరం పనులు

రూ.320 కోట్లతో కండలేరు రిజర్వాయర్ నీటి నిలువ సామర్ధ్యం పెంపు

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 9: కండలేరు రిజర్వాయర్ నీటి నిలువ సామర్ధ్యాన్ని పెంచేందుకు రూ.320 కోట్ల ఖర్చుతో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపినట్లు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఈ పనులు చేపట్టేందుకు ఆర్ధిక సహకారం అందించడానికి జపాన్‌కు చెందిన జైకా ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. స్థానిక జలవనరులశాఖ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాలశాఖ మంత్రి పి.నారాయణతో కలిసి నెల్లూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు పనుల ప్రగతిని ఆయన సమీక్షించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ సంగం బ్యారేజి, నెల్లూరు బ్యారేజిలలో ప్యాకేజీల వారిగా పనుల ప్రగతిని సమీక్షించామని అక్టోబర్ లోపు ఈ పనులన్నీ పూర్తిచేయాల్సిందిగా ఆదేశాలిచ్చామని మంత్రి తెలిపారు. తెలుగు గంగ పథకం కింద లక్షా 42వేల ఎకరాల్లో లక్ష ఎకరాలకు మాత్రమే నీరు అందించడం జరిగిందని మిగిలిన 42వేల ఎకరాలకు నీరు అందించే పనులు పూర్తిచేసేందుకు అధికారులను ఆదేశించామన్నారు. నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది 9లక్షల 73వేల ఎకరాలకు నీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ముంగనూరు-దగదర్తి, రాచర్ల-దగదర్తి కాల్వల ఆధునీకరణకు రూ.120 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. రోజుకు లక్షా ఇరవై క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించడం జరుగుతుందని అదే విధంగా పునరావాస ప్యాకేజీ కింద పశ్చిమగోదావరి జిల్లాకు రూ.60 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాకు రూ.65 కోట్లు విడుదల చేసామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేసేందుకు అవసరమైన ప్యాకేజీ ఇచ్చేందుకు ఐఎఎస్ అధికారుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయన్నారు. పట్టిసీమ పథకం కింద 24 పంపూలు మార్చి నెలాఖరుకు పూర్తవుతాయన్నారు. ఈ ఏడాది రబీ పంటకు కృష్ణా డెల్టాలోని 8 లక్షల 30వేల ఎకరాల్లోని పంటను పట్టిసీమ పథకం వల్ల మాత్రమే కాపాడగలిగామని మంత్రి అన్నారు. మున్సిపల్ మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరు బ్యారేజి, సంగం బ్యారేజీలు గత దశాబ్దకాలంగా పనులకు నోచుకోలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులకు ఆటంకంగా వున్న 780 ఎకరాల అటవీ భూములను క్లియర్ చేయించామన్నారు. కావలి కాలువ పనులు 4 నెలల్లోనే పూర్తి చేయించి ఈ కాలువ ప్రవాహ సామర్ధ్యాన్ని 540 క్యూసెక్కుల నుంచి వెయ్యి క్యూసెక్కులకు పెంచగలిగామన్నారు. ఇందువల్ల ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన నీటిని ఈ కాలువ ద్వారా 54 చెరువుల్లో నీటిని నిలువ చేయగలిగామన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం 880 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు.
80వేల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, సూపరింటెండెంట్ ఇంజనీర్ సుధాకర్‌లు పాల్గొన్నారు.