రాష్ట్రీయం

చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలోనూ ఇక పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఈ నెల 7న కరీంనగర్ జిల్లా మంథనిలో, 9న రంగారెడ్డి జిల్లా పరిగిలో, 21న తిరుపతిలో, 25న విజయవాడలో, 29న కర్నాటకలోని బీదర్‌లో భారీ ఎత్తున భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.
రెండు రోజుల క్రితం రాజ్యసభలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి బిసిలకు అసెంబ్లీ, పార్లమెంటులో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని ఆయన కోరారు.