రాష్ట్రీయం

చరిత్రకు తరగని గని కొండపల్లి కోట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: తరతరాల చరిత్రకు తరగని గని కొండపల్లి కోట అని ప్రముఖ చరిత్రకారుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. శనివారం కల్చరల్ సెంటర్, మలినేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ (పుల్లడిగుంట) జిజ్ఞాస సంస్థలు సంయుక్తంగా శనివారం కొండపల్లి కోట వద్ద నిర్వహించిన హెరిటేజ్ ట్రెక్, హెరిటేజ్ వాక్ (వారసత్వ నడక) లకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థునులకు క్రీ.శ.13-18 శతాబ్దాల మధ్య కాలంలో జరిగిన చారిత్రక సంఘటనలను వివరించారు. రెడ్డిరాజుల కాలంలో నిర్మితమైన కొండవీటి కోటను వరుసగా గజపతులు, విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.1516 ఏప్రిల్ 5వ తేదీన వశపరచుకున్న తీరును తెలియజెప్పి, తరువాత కుతుబ్‌షాహీ, మొగల్, అసఫ్‌జాహీ, ఫ్రెంచి, ఇంగ్లీషు వారి పాలనలో జరిగిన సంఘటనను సోదాహరణంగా వివరించారు. కొండపల్లి గిరి దుర్గంలో దర్బారు, నర్తనశాల, రాజమహల్, మార్కెట్టు, జైలు, అశ్వ, గజశాలలు, ఆయుధాగారం, గోల్కొండ దర్వాజా, ఖమ్మం మెట్టు దర్వాజా, ఒంటెమాన్యం కొండ మొదలైన కట్టడాలు, వ్యూపాయింట్లు, బురుజులు మొదలైన వాటి నిర్మాణ శైలి, చారిత్రకాంశాలను ఆయన విద్యార్థులకు వివరించారు. కొండపల్లి నుంచి ఖమ్మం మెట్టుకు గానీ, గోల్కొండకు గానీ సొరంగ మార్గాలున్న ఆధారాలు దొరకలేదని, అయితే విపత్కర పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం చేసుకున్న ఏర్పాట్లు కొండపల్లి కోటలో ఉన్నాయన్నారు. దాదాపు 750 సం.ల చరిత్రకు ప్రత్యక్ష సాక్షిగానున్న కొండపల్లి కోట వారసత్వ పరిరక్షణలో విద్యార్థులు సహకరించాలని శివనాగిరెడ్డి అన్నారు. మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాల, వైస్ చైర్మన్ మలినేని పెరుమాళ్లు, డీన్ కిశోర్‌బాబు, స్టూడెంట్ యాక్టివిటీ ఇన్‌ఛార్జి సురేంద్రబాబు, జిజ్ఞాస సంస్థ డైరెక్టర్ వై.్భర్గవ్, సీఈవో అమర్‌కిరణ్, నాగార్జున ఇంకా 200 మందికి పైగా విద్యార్థినులు ఈ వారసత్వ నడక కార్యక్రమంలో పాల్గొన్నారని శివనాగిరెడ్డి చెప్పారు.