రాష్ట్రీయం

పీఎస్‌యూల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 19: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని జాతీయ స్థాయి ట్రేడ్ యూనియన్‌ల స్టీరింగ్ కమిటీ స్పష్టం చేసింది. విశాఖలో సోమవారం జరిగిన సమావేశంలో సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వదేశీ దేవరాయ్ మాట్లాడుతూ విశాఖలో పలు ప్రభుత్వ రంగం సంస్థలకు అండగా నిలవనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ రంగం సంస్థలు ఎక్కువగా ఉన్న విశాఖలో ఈ సారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించడంపై ఆయన స్పందిస్తూ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)ని నూరు శాతం ప్రైవేటీకరించాలన్న కేంద్ర నిర్ణయం అత్యంత దారుణమన్నారు. లాభాలార్జిస్తున్న డీసీఐని ప్రైవేటీకరించాలని కేంద్రం యత్నించడం, అలాగే విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 10 శాతం వాటాల విక్రయ నిర్ణయం వంటి అంశాలు ఇక్కడ కార్మిక, ఉద్యోగ వర్గాలను తీవ్ర అశాంతికి గురిచేస్తోందన్నారు. దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు లేకుండా చేయాలన్న కుట్రలో భాగంగానే కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సర్కాలు కుటిల నిర్ణయాలు తీసుకుంటోందని ధ్వజమెత్తారు. విదేశీయులతో కుమ్మక్కై దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కేంద్రం భావిస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా లక్ష కోట్ల రూపాయలు ఆర్జించామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించడం సిగ్గుచేటన్నారు. సిటూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నర్శింగరావు మాట్లాడుతూ రక్షణ రంగంలో కూడా ప్రైవేటీకరణకు సిద్ధపడటం దేశ భద్రతకే ముప్పును తెచ్చిపెడుతుందన్నారు. బెంగళూరు ప్రభుత్వ రంగ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ మీనాక్షి సుందరం మాట్లాడుతూ రూ.లక్ష కోట్లు విలువ చేసే బీఈఎంఎల్‌ను కేవలం రూ.1,700 కోట్లకే రిలయల్స్ సంస్థకు విక్రయించేందుకు సిద్ధమైందన్నారు. కేంద్ర చర్యలను కార్మిక సంఘాలు ముక్త కంఠంతో ఎదిరిస్తాయన్నారు.
కదం తొక్కిన కార్మికులు
డీసీఐ, స్టీల్‌ప్లాంట్ సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆలిండియా ట్రేడ్ యూనియన్స్ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఐటీయూ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు ప్రసేన్ సేన్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో కార్మికులు, సామాన్య ప్రజానీకం అంటే ప్రధాని నరేంద్ర మోదీకి గిట్టదని, అందుకే వారిని ఇబ్బందులకు గురిచేసే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే ప్రధాని వాటాల విక్రయం చేపట్టారని ధ్వజమెత్తారు.

చిత్రం..స్టీరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడుత్నున సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి దేవరాయ్