రాష్ట్రీయం

రైతులకూ కార్పొరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ‘తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి’ పేరిట రాష్ట్రంలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వ్యవసాయాభివృద్ధి- రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి కార్పొరేషన్ దోహదం చేస్తుందన్నారు. లాభాపేక్షలేని సంస్థగా ఇది పని చేస్తుందన్నారు. సంస్థకు సమకూర్చే నిధులను లక్ష్యాల సాధనకు వినియోగిస్తామన్నారు. గ్రామ, మండల రైతు సమన్వయ సమితిల మాదిరిగానే త్వరలో జిల్లా, రాష్ట్ర స్థాయి రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తామన్నారు. రైతు సమన్వయ సమితుల నిర్మాణం, విధులు, బాధ్యతలను ఖరారు చేయడంతోపాటు, ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్న ప్రాంతీయ సదస్సులపై గురువారం ప్రగతి భవన్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంఓ అధికారులతో కేసీఆర్ చర్చించారు. విత్తనం వేసినప్పటి నుంచి పంటకు మద్దతు ధర వచ్చే వరకు ప్రతీ దశలోనూ రైతు సమన్వయ సమితులు చురుకైన పాత్ర పోషిం చేలా విధులు, బాధ్యతలు అప్పగిస్తామన్నారు. రైతు సమన్వయ సమితుల్లో
కనీసం 51శాతం మంది బలహీన వర్గాలు, మహిళలు ఉండేలా నిర్మాణం జరుగుతుందన్నారు. ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహించే ప్రాంతీయ సదస్సుల్లో మండల రైతు సమన్వయ సమితుల సభ్యులతోపాటు ఆయా జిల్లాలకు చెందిన మంత్రుల, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు హాజరు కావాలన్నారు. రైతులు పరస్పరం తమ అభిప్రాయాలు పంచుకోవడానికి, నిరంతర అవగాహన సదస్సులు నిర్వహించడానికి ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒకటి చొప్పున రాష్టవ్య్రాప్తంగా 2630 రైతు వేదికలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ వేదికలను త్వరగా ఏర్పాటు చేయాలని, నిర్వహణ బాధ్యతలను మండల రైతు సమన్వయ సమితులు తీసుకోవాలన్నారు. ఈ వేదికల నిర్మాణం కోసం అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు లభించని పక్షంలో దాతలనుంచి తీసుకోవాలని, అది కూడా అందుబాటులో లేకపోతే కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.

చిత్రం..మంత్రులు, ఉన్నతస్థాయ అధికారులతో గురువారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన
సమీక్షలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్