రాష్ట్రీయం

పెట్టుబడులు @ 2లక్షల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 25: భాగస్వామ్య సదస్సులో రెండో రోజు పెట్టుబడుల వరద పారింది. కేవలం రెండో రోజు 1,74,568 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రెండు రోజులు కలిపి 2,18,814 కోట్ల రూపాయల పెట్డుబడులు వచ్చినట్టు రాష్ట్ర పరిశ్రమల మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. తొలి రోజు ఆటోమోటివ్ రంగంలో 15 సంస్థలు 15,224 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. పర్యాటక రంగంలో 56 సంస్థలు 7,807 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. వౌలిక సదుపాయల రంగంలో మూడు సంస్థలు 12,500 కోట్ల పెట్టుబడులకు ఆసక్తి కనబరిచాయి. పరిశ్రమల రంగంలో ఐదు సంస్థలు 8,715 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నాయి. వెరసి 44,246 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు మంత్రి వెల్లడించారు. దీని ద్వారా 98,291 మందికి ఉపాధి లభించనుంది. ఇక రెండో రోజు ఏరో స్పేస్, డిఫెన్స్ రంగాల్లో 10 సంస్థలు 9,406 రూపాయల మేర పెట్టుబడులు పెట్టాయి. ఈ రంగంలో 6 వేల మందికి ఉపాధి లభించనుంది. టెక్స్‌టైల్స్ రంగంలో 25 సంస్థలు 5,337 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఎనర్జీ రంగంలో 34 సంస్థలు 1,11,921 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ రంగంలో 1,33,031 మందికి ఉపాధి లభించనుంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో169 సంస్థలు 3,534 కోట్ల పెట్టబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఈ రంగంలో 48,398 మందికి ఉపాధి లభించనుంది. ఆరోగ్య రంగంలో 25 సంస్థలు 5,090 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమల రంగంలో 22 సంస్థలు 39,281 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ రంగంలో 61 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
హోదా ఇవ్వకపోవడం వలన పరిశ్రమలు ఇచ్చే రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తోందని, అదే హోదా ఇచ్చి ఉంటే, ఆ భారాన్ని కేంద్రం భరించాల్సివచ్చేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వెసులబాటు కలిగే ఈ మొత్తాన్ని వౌలిక సదుపాయాలకల్పనకు వినియోగించేవారమని మంత్రి చెప్పారు. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నప్పుడు ఇక హోదా ఎందుకని ఈ ప్రాంతానికి చెందిన నాయకులే పేర్కొనడం శోచనీయమని ఆయన అన్నారు. ఈ భాగస్వామ్య సదస్సును కేంద్ర నిధులతో నిర్వహిస్తున్నారని కొంతమంది నేతలు చేసిన వ్యాఖ్యలను మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఖండించారు.