రాష్ట్రీయం

ఈజ్ కాదు.. ప్లెజర్ ఆఫ్ డూయంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 25: ప్రపంచం అంతా ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతోంది... అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఈ విషయంలో పోటీ పడుతున్నాయి... ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్లజర్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా మార్చేశారని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేష్ ప్రభు కితాబునిచ్చారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండో రోజైన ఆదివారం ప్రమోటింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న అంశంపై జరిగిన చర్చలో ప్రభు మాట్లాడారు. దేశంలో సుసంపన్నమైన వనరులు ఉన్నాయి. మావన వనరులైతే మరీ మెండుగా ఉన్నాయి. ప్రపంచంలో ఏదేశానికి వెళ్లినా, అక్కడ భారత దేశానికి చెందిన వారు విద్య, వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. అభివృద్థి చెందిన దేశాల సరసన భారత దేశం నిలిచిందనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని అన్నారు. మూడేళ్ల కిందట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత దేశం 147 స్థానంలో ఉండేదని, ఇప్పుడు 100 స్థానానికి చేరుకుందని మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజిసెన్‌లో దేశంలో ఏపీ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించడం ముదావహమని అన్నారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో వ్యాపారవేత్తలను ఆకర్షించేందుకు ఇటువంటి సదస్సులు నిర్వహిస్తూ, వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్లజర్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా మార్చారని చెప్పారు. వ్యాపార రంగంపై చంద్రబాబుకు ఉన్న ఎంత మక్కువ ఉందన్నది దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. అలాగే, ఏపీలో ఈ-గవర్నెన్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తోందని అన్నారు. ఈ సదస్సును ప్రపంచంలోని అనేక దేశాలు వీక్షించే పరిస్థితి ఉందంటే రాష్ట్రం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతగా వినియోగించుకుంటోందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ 2015లో దేశంలోనే రెండో స్థానంలో ఉందని, 2016 నుంచి నేటి వరకూ నెంబర్ స్థానంలో కొనసాగుతూ వస్తోందని అన్నారు. పరిశ్రమలకు స్మార్ట్ అప్రూవల్స్ ఇవ్వడంలో మిగిలిన రాష్ట్రాలకన్నా ఏపీ ముందంజలో ఉందని చంద్రబాబు చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉందని, ఇండియా 100వ స్థానంలో, ఏపీ 88వ స్థానంలో ఉందని చెప్పారు.
పరిశ్రమలకు కన్‌స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చే విషయంలో డెన్మార్క్ నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఇండియా 182వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 156వ స్థానంలో ఉన్నాయని ప్రభు వివరించారు. ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే 29 స్థానానికి చేరుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా కాకినాడలో 25 ఎకరాల్లో నిర్మించనున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఎఫ్‌టీ)కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అలాగే కాకినాడలో 25 ఎకరాల్లో నిర్మించనున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ క్యాంపస్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ-స్పైస్ బజార్ వెబ్‌పోర్టల్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ఆక్వా రైతులకు ఎన్‌రోల్‌మెంట్ కార్డులను పంపిణీ చేశారు. విశాఖపట్నంలో టెక్నాలజీ అండత్ ఇన్నొవేషన్ సపోర్ట్ సెంటర్(టీఐఎస్‌సీ)కి సంబంధించి నేషనల్ రీసెర్చ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ఇంటలెక్చువల్ ప్రోపర్టీ ఫెసిలిటేట్ సెంటర్ మధ్య ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం కుదిరింది.
చిత్రం..విశాఖలో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సపోర్ట్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఎన్‌ఆర్‌డీసీ, ఐపీఎస్‌సీల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంటున్న దృశ్యం