రాష్ట్రీయం

నిధులివ్వకపోవడం అన్నది అపోహ మాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంనుంచి నిధులు సరిగా రావడం లేదనేది కేవలం అపోహ మాత్రమేనని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. సోమవారం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌తో మాణిక్యాలరావు భేటీ అయ్యారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి తగిన కేటాయింపులు జరపలేదనేది కేవలం అపోహ మాత్రమేనని ఆయన అన్నారు. ఐఐటికి రూ.1100కోట్లు కేటాయించిందని, తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటుకు రూ.50కోట్లు బడ్జెట్‌లో కేటాయించినా, రూ.189కోట్లు మంజూరు చేయడంతో టెండర్లు పిలిచినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో వివిధ పథకాలకు, నిర్మాణాలకు సంబంధించి ఖర్చు చేసిన వాటికి కేంద్రం ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేస్తోందని ఆయన చెప్పారు. ఏపీలో నిర్మిస్తున్న కేంద్ర విద్యా సంస్థలను త్వరగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి జావడేకర్ హామీ ఇచ్చినట్టు మాణిక్యాలరావు వెల్లడించారు.