రాష్ట్రీయం

ఫలించిన ఏపీ కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 27: రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ద్వారా ప్రపంచానికి తెలియజేశామన్న సంతృప్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేశారు. వరుసగా మూడోసారి విశాఖలో జరిగిన సదస్సు ఉత్సాహంగా జరిగిందన్నారు. ఉండవల్లి గ్రీవెన్స్ హాల్‌లో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెట్టుబడులు ఆకర్షించడంలో ఏపీఈడీబీ, పరిశ్రమలు, ఐటీ తదితర శాఖలు క్రియాశీలకంగా వ్యవహరించాయన్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ ఇచ్చేందుకు అనేక ఒప్పందాలు చేసుకుందన్నారు. మూడు రోజుల్లో 4.39 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు 734 ఒప్పందాలు జరిగాయన్నారు. పెట్టుబడుల ద్వారా 11 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చన్నారు. పరిశ్రమల శాఖలో 58,337 కోట్లకు 129 ఒప్పందాలు, గనుల శాఖలో 12,227 కోట్లతో ఒప్పందాలు, ఐటీలో 30,050 కోట్లకు 70 ఒప్పందాలు కుదిరాయన్నారు. ఆహార శుద్ధి, పర్యాటక, వైద్య ఆరోగ్యానికి సంబంధించి, మరోపక్క గూగుల్, రిలయన్స్, ఆదాని, మహేంద్ర గ్రూప్‌తోనూ ఒప్పందాలు జరిగాయన్నారు. అమరావతిలో సుమారు రూ.50 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి రియల్‌టైమ్ గవర్నెన్స్ ద్వారా అనుమతులు కల్పిస్తున్నామని, పెట్టుబడులకు సంబంధించిన పురోగతి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఉంచుతామని తెలిపారు. కియా కార్ల నుంచి ఫ్యాక్స్‌కాన్ సెల్‌ఫోన్ వరకు రాష్ట్రంలో తయారవుతున్న వివిధ ఉత్పత్తులను సదస్సులో ప్రదర్శించామని, అవి అందరినీ ఆకట్టుకున్నాయన్నారు. చార్టింగ్ ఇండియాస్, గ్లోబల్ ఇంటిగ్రేషన్ స్ట్రేటజీ పేరుతో ప్రభుత్వ లక్ష్యాలను తెలియజేశామన్నారు. ఏపీకి మొదటి నుంచి సాయం చేస్తున్న సింగపూర్ మంత్రి ఈ సదస్సుకు హాజరై రాష్ట్రంపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారన్నారు. ఏపీ సింగపూర్ బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటుకు ముందుకొచ్చారన్నారు. సింగపూర్ కన్సార్టియం, అమరావతి అభివృద్ధి సంస్థతో కలిపి 1691 ఎకరాల్లో స్టార్టప్ ప్రాజెక్టు ఏర్పరిచిందని తెలిపారు. అమరావతిలో ఐదెకరాలలో ఫేజ్ జీరో పేరుతో చేపట్టే ప్రాజెక్టులో రాజధాని అమరావతికి సంబంధించిన సమగ్ర స్వరూపాన్ని కళ్లకు కట్టేలా ఒక ఎగ్జిబిషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అనుకోని అతిథిగా హాజరైన మారిషస్ ఉపాధ్యక్షుడు పరమశివం పిళ్లై ఏపీకి సహకారమందిస్తామని హామీ ఇచ్చారన్నారు. శ్రీలంక వాణిజ్య శాఖ మంత్రి రిషద్‌ను పర్యాటక రంగానికి సంబంధించి సహకారమందించాలని కోరామన్నారు. సృజనాత్మకతలో ఏపీ ఒక శక్తిగా ఎదుగుతోందని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐటీ ప్లాట్‌ఫాంల వేదికగా ప్రపంచానికి తమ శక్తిని చాటుతోందన్నారు. పెట్టుబడులకు రాష్ట్రం సరైన వేదికగా అందరూ గుర్తించారన్నారు. ఇన్నోవేటివ్, ఇంక్యుబేషన్, స్టార్టప్ వెంచర్ క్యాపిటల్ ఎకో సిస్టం ఏర్పాటుకు ముఖేష్ అంబాని సహా మరో రెండు సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు.