రాష్ట్రీయం

1, 2 తేదీల్లో విధులకు గైర్హాజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: హైదరాబాద్‌లో సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్లను సుప్రీం కోర్టును కోరుతూ తీర్మానం చేశాయి. మంగళవారం హైకోర్టులో రెండు రాష్ట్రాల బార్ అసోసియేషన్ సభ్యుల సమావేశం జరిగింది. 2015 నుంచి హైకోర్టు ప్రధానన్యాయమూర్తి పోస్టు ఖాళీగా ఉంది. పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనలో భాగంగా మార్చి 1, 2 తేదీల్లో హైకోర్టు విధులకు హాజరుకామని, మదీనా హోటల్ నుంచి హైకోర్టు వరకు ర్యాలీ నిర్వహిస్తామని ఈ సమావేశం తీర్మానించింది. తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జల్లి కనకయ్య, ఆంధ్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చల్లా ధనంజయ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. హైకోర్టులో 61 మంది జడ్జిల పోస్టులను మంజూరు చేశారు. కాని 30 మంది న్యాయమూర్తులే ఉన్నారు. మరో ముగ్గురు న్యాయమూర్తులు వచ్చే మే నుంచి ఏడాది కాలంలో రిటైర్డు కానున్నారు. హైకోర్టుకు రెగ్యులర్ ప్రధాన న్యాయమూర్తిని నియమించాల్సిన అవసరం ఉందని తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి పి సుజాత తెలిపారు.