రాష్ట్రీయం

విద్యా సంస్థలపై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, మార్చి 1: విద్యార్థుల నుండి ఎడాపెడా ఫీజులు వసూలుచేస్తూ, రాష్ట్రంలోని పురపాలక చట్టంలోని 88 (1)సి సెక్షన్ కింద ఆస్తి పన్ను మినహాయింపు పొందుతున్న విద్యాసంస్థలపై పురపాలక శాఖ కొరడా ఝుళిపిస్తోంది. సేవాభావంతో విద్యార్థుల నుండి ఎటువంటి రుసుములు వసూలుచేయని విద్యాసంస్థలకే ఈ మినహాయింపు వర్తిస్తుందని పేర్కొం టూ, ఇతర అన్ని విద్యాసంస్థల నుండి బకాయిలతో సహా పన్ను వసూలచేయాలని నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర పురపాలక పరిపాలన శాఖ ఆదేశాలు జారీచేసింది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలోని వీఎస్‌ఎం కళాశాల వ్యవహారంలో తలెత్తిన వివాదంతో రాష్టవ్య్రాప్తంగా ఈ ఉత్తర్వులు దుర్వినియోగం అవుతున్న విషయాన్ని గుర్తించిన పుర పరిపాలన శాఖ ఉన్నతాధికారులు ఈమేరకు ఆదేశాలు జారీచేశారు. వివరాల్లోకి వెళితే... రామచంద్రపురంలోని వీఎస్‌ఎం డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల భవనాలకు 2001-2002 సంవత్సరం అక్టోబరు నుంచి 12 అసెస్‌మెంట్ల ద్వారా ఆస్తిపన్ను విధించారు. అయితే మున్సిపల్ పన్ను విధింపు తమకు వర్తించదని, 88(1)సి కింద విద్యాసంస్థలకు పన్ను మినహాయింపు ఉందని పేర్కొంటూ కళాశాల యాజమాన్యం న్యాయస్థానాలను ఆశ్రయించింది. రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటీషన్ 14755/2014, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ 19545/2014 దాఖలు చేసింది. అయితే హైకోర్టులో మున్సిపాలిటీకి అనుకూలంగా తీర్పు వెలువడటంతో సర్వోన్నత న్యాయస్థానాన్ని కళాశాల యాజమాన్యం ఆశ్రయించింది. వీఎస్‌ఎం కళాశాల యాజమాన్యం ఏర్పాటుచేసిన ఛారిటబుల్ రికార్డును పరిశీలించి, అందుకు అనుగుణంగా అంగీకారం, ఆమోదయోగ్యం అని కమిషనర్ భావిస్తే.. చట్టపరిధిలో పన్ను అంశంపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈమేరకు కమిషనర్ కళాశాల యాజమాన్యానికి విచారణ నోటీసు పంపించారు. యాజమాన్యం దస్తావేజులు, కాగితాలు, వారి వాదన వివరాలను పంపించగా కమిషనర్ సంతృప్తిచెందక, వీఎస్‌ఎం కళాశాలను ధార్మిక విద్యాసంస్థగా గుర్తించలేదు. స్పీకింగ్ ఆర్డర్స్ ద్వారా పన్ను మినహాయింపు కుదరదని, బాకీ మొత్తం చెల్లించాల్సిందేనని నోటీసులు జారీచేశారు.
ఈ అంశంపై రాష్ట్ర పురపాలక మంత్రి, ఆ శాఖ సంచాలకులకు వీఎస్‌ఎం కళాశాల యాజమాన్యం వినతిపత్రాలు పంపింది. దీనిపై పురపాలక శాఖ సంచాలకులు ఒక ప్రశ్నావళిని రూపొందించి, పూర్తి సమాచారాన్ని సేకరించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఆ ప్రశ్నావళిని కళాశాల యాజమాన్యంకు అందించారు. వారిచ్చిన జవాబుల మేరకు మున్సిపల్ కమిషనర్ చిలకమర్తి శ్రీరామశర్మ పంపిన నివేదిక ఆధారంగా వీఎస్‌ఎం కళాశాలకు పన్ను మినహాయింపు కుదరదని ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈతరహాలో ఎటువంటి సేవాభావం లేకుండా ఫీజులు వసూలుచేస్తున్న అన్ని విద్యాసంస్థల నుండి యథావిథిగా ఆస్తిపన్ను వసూలుచేయాలని నిర్ణయించారు. ఈమేరకు అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల కమిషనర్లకు పురపరిపాలన శాఖ సంచాలకుని నుండి ఆదేశాలు జారీఅయ్యాయి. కాగా వీఎస్‌ఎం కళాశాల యాజమాన్యానికి రూ.2.34 కోట్లు చెల్లించాలని రెండు రోజుల్లో నోటీసు జారీచేయనున్నట్లు కమిషనర్ చిలకమర్తి శ్రీరామశర్మ స్పష్టంచేశారు. గతంలో చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి కమిషనర్‌గా విధులు నిర్వహించిన సమయంలో శ్రీరామశర్మ విద్యాలయాల యాజమాన్యాల నుండి రూ.48 లక్షల మేర ఆస్తిపన్ను వసూలు చేశారు. అలాగే చిత్తూరు కార్పొరేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో, పారిశ్రామికవేత్త ఆదికేశవుల నాయుడు విద్యాసంస్థలకు ఆస్తిపన్ను విధించడం సంచలనం సృష్టించింది.
రామచంద్రపురంలో ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న భారీ మొత్తంలో ఆస్తిపన్ను వివాదాన్ని ఒక కొలిక్కి తీసుకువచ్చిన మున్సిపల్ కమిషనర్ చిలకమర్తి శ్రీరామశర్మను మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, పురపాలక అధికారులు కొనియాడుతున్నారు.