రాష్ట్రీయం

అడవిలో హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, మార్చి 8: చర్ల ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు శుక్రవారం బంద్ నిర్వహించనున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మావోల బంద్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలను చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు సూపరిండెంట్ అంబర్ కిషోర్‌ఝా ఏజెన్సీలోని పోలీసు స్టేషన్ల వివరాలను ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ పోలీసులను మరింత అప్రమత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్, బస్టాండులో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్ల సమీపంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు.
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ఆర్టీసి బస్సును మావోయిస్టులు దగ్ధం చేయడంతో ఆర్టీసి అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా గురువారం నుండి ఏజెన్సీ ప్రాంతంలోని నైట్‌హాల్ట్ బస్సు సర్వీసులను రద్దు చేశారు. మావోయిస్టుల బంద్ సందర్భంగా నక్సలైట్లు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో పోలీసు స్టేషన్లలో భద్రతను మరింత పెంచారు. స్పెషల్‌పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్ పోలీసులు ఏజెన్సీ ప్రాంతంలోని అడవుల్లో పెద్ద ఎత్తున్న జల్లెడ పడుతున్నారు. కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం ఆర్టీసీ డిపోల నుండి ఏజెన్సీ ప్రాంతాలైన వెంకటాపురం, వాజేడు, పేరూరు, టేకులగూడెం, రంగాపురం, ఏటూరు నాగారం, సీలేరు, చర్ల, గుండాల, మర్కోడు, ఇల్లందు ప్రాంతంలోని నైట్‌హాల్ట్ బస్సు సర్వీసులను నిలిపివేశారు. భద్రాచలం డిపోనుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చింతూరు, కూనవరం మండలాలతోపాటు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్, కుంట, బైలాడిల్లా వెళ్ళే సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆర్టీసి అధికారులు ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాలకు ఉదయం 8 గంటలనుండి సాయంత్రం 4 గంటల లోపే ఆర్టీసీ బస్సులను నడుపుతుండటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బంద్ సందర్భంగా మావోయిస్టులు దాడులకు పాల్పడే అవకాశాలు ఉండటంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్న దారుణ పరిస్థితి ఏజెన్సీ ప్రాంతంలో నెలకొంది.