రాష్ట్రీయం

తొందరపడకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 8: కేంద్ర మంత్రివర్గం నుంచి నిష్క్రమించాలన్న టీడీపీ నిర్ణయాన్ని మరోసారి పునరాలోచించుకోవాలని సీఎం చంద్రబాబుని ప్రధాని నరేంద్రమోదీ గురువారం టెలిఫోన్‌లో కోరారు. మంత్రివర్గం నుంచి బయటకు రావాలని బుధవారం రాత్రి తీసుకున్న నిర్ణయం మోదీకి తెలిపేందుకు బాబు ప్రయత్నించినప్పటికీ, ప్రధాని అందుబాటులోకి రాని విషయం తెలిసిందే. దానితో స్వయంగా ప్రధాని గురువారం బాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి తమ పదవులకు రాజీనామా చేయడానికి ముందే ప్రధాని ఫోన్ చేశారు. ప్రధాని మోదీ తనతో మాట్లాడిన సారాంశాన్ని వివరించేందుకు మంత్రులను సీఎం బాబు హుటాహుటిన పిలిపించారు. ‘ప్రధాని నాకు ఇందాక ఫోన్ చేశారు. రాజీనామాలపై తొందరపడవద్దని సూచించారు. కూర్చుని మాట్లాడుకుందామన్నారు. అయితే నేను ఆయనకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వివరించి సున్నితంగా తిరస్కరించా. ప్రజల మనోభావాల మేరకు వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించా’నని మంత్రులకు తెలిపారు. హోదా అంశం రాష్ట్రంలో సెంటిమెంటుగా మారిందని వివరించానన్నారు. ఏ పార్టీ అయినా ప్రజల మనోభావాల ప్రకారమే నడుచుకోవాలని, లేకపోతే వాటికి మనుగడ ఉండదన్న తన రాజకీయ అనుభవాన్ని మోదీకి వివరించానని బాబు మంత్రివర్గ సహచరులకు చెప్పారు. అయితే, ఆయన తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సానుకూలంగా చర్చించుకుందామని సూచించగా, తాము కేంద్రం నుంచి వైదొలగినా ఎన్డీఏలో కొనసాగుతున్నామని ఆయనకు చెప్పానన్నారు. దానికి స్పందించిన మోదీ తాను ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పారన్నారు.