రాష్ట్రీయం

ఆకాశమే మాకు హద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: హైదరాబాద్ నగరం విమానయాన రంగానికి హబ్‌గా మారడంతో తెలంగాణలో ఏవియేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏవియేషన్ వర్సిటీని నెలకొల్పడానికి అన్ని విధాలుగా తెలంగాణ అనుకూలంగా ఉందని మంత్రి గుర్తు చేసారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో 4 రోజుల పాటు జరుగనున్న అంతర్జాతీయ ఏవియేషన్ ఎగ్జిబిషన్, ఎయిర్ షోను (వింగ్స్ ఇండియా- 2018) మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. తెలంగాణలో ప్రస్తుతం ఏవియేషన్, ఏరోస్పేస్‌కు సంబంధించి అనేక ప్రపంచస్థాయి సంస్థలు ఉన్నాయన్నారు. దేశంలోనే మొట్ట మొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటైందన్నారు. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయం ఇదేనన్నారు. ఏటా ఇక్కడినుంచి 1.8లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నా రని, లక్ష 35 వేల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరుగుతుందన్నారు.
గత కొనే్నళ్లుగా నంబర్ వన్ ర్యాంక్‌ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయమే దక్కించుకుంటుందన్నారు. విమానయాన సరుకు రవాణాలో తెలంగాణ అగ్రగ్రామిగా ఉందన్నారు. ముఖ్యంగా ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు ఇది హబ్‌గా మారిందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు బేగంపేట, వరంగల్, హకీంపేట, దుండిగల్, నాదర్‌గుల్, రామగుండం ఎయిర్ పోర్టులు ఉండగా, వరంగల్‌లో ఏర్పాటు చేస్తోన్న మెగా టెక్స్‌టైల్ పార్క్, ఐటి హబ్ వల్ల వరంగల్ విమానాశ్రయం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధిపర్చడంపై ప్రభు త్వం దృష్టిసారించిందన్నారు. ఏరో స్పేస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో తెలంగాణ ఇప్పటికే అభివృద్ధి చెందడంతో ఇక్కడ ఏవియేషన్ వర్సిటీ ఏర్పాటుకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేసారు.
అశోక్‌గజపతిరాజు సేవలు ఎనలేనివి
వింగ్స్ ఇండియా సదస్సును ప్రారంభించాల్సిన కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఢిల్లీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామల నేపథ్యంలో కార్యక్రమానికి రాలేకపోవడంతో తాను ప్రారంభించాల్సి వచ్చిందని మంత్రి కేటీఆర్ వివరించారు. అశోక్‌గజపతిరాజు హయాంలో విమానయానం ఎంతో
అభివృద్ధి చెందిందని మంత్రి ప్రశంసించారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఉహించలేమని అన్నింటికి సిద్ధంగా ఉండాలన్నారు. దేశంలో గడిచిన 70 ఏళ్లలో 70 విమానాశ్రయాలు ఉండగా అశోక్‌గజపతిరాజు హయాంలో కొత్తగా 60 విమానాశ్రయాలు ఏర్పాటయ్యాయని కేటీఆర్ వివరించారు. పౌర విమానయాన శాఖ కార్యదర్శి చౌబే మాట్లాడుతూ దేశంలో కొత్తగా 56 విమానాశ్రయాలు ఏర్పాటు కాగా ఇప్పటికే 18 విమానాశ్రయాలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయన్నారు.
బేగంపేటలో విమానాల జాతర
రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫిక్కి సంయుక్త ఆధ్వర్యంలో వింగ్స్ ఇండియా 2018 వేడుకల సందర్భంగా బేగంపేట విమానాశ్రయానికి వివిధ దేశాలు, కంపెనీలకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు ప్రదర్శనలో కొలువుదీరాయి. అమెరికా, జపాన్, యూకే, రష్యా, సింగపూర్, ఫ్రాన్స్, జర్మని, మలేషియా, హాంకాంగ్, ఇటలీ, ఇరాన్ తదితర 10 దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రదర్శనలో 15 ఎయిర్‌క్రాఫ్ట్ బోయింగ్, ఎంబ్రార్, డస్సాల్డ్, క్లబ్ వన్ ఎయిర్, ఏరోటెక్, జూమ్ ఎయిర్, ఎయిర్ ఇండియా, ఎన్‌ఏఎల్ విమానాలు కొలువుదీరాయి. వింగ్స్ ఇండియా-2018 పేరుతో దేశంలో ప్రాంతీయ అనుసంధానం పెంచడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేసినట్టు నిర్వహకులు తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్స్ తయారీ, ఎయిర్‌క్రాఫ్ట్ మిషనరీ, ఎక్విప్‌మెంట్స్, ఇంటీరియర్స్, ఎయిర్‌లైన్స్, ఎయిర్‌లైన్స్ సర్వీసెస్, ఎయిర్‌కార్గో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్‌మెంట్ స్పెస్, ఎక్విప్‌మెంట్ స్పేస్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ అంశాలను వివరించేందుకు సివిల్ ఏవియేషన్, ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రాలు..వింగ్స్ ఇండియా -2018 ప్రదర్శనలో విమానాలను పరిశీలిస్తున్న ఐటీ మంత్రి కేటీఆర్.
*రన్‌వేపై కొలువుదీరిన వివిధ దేశాలకు సంబంధించిన విమానాలు