రాష్ట్రీయం

ఎంబీసీల ఉపాధి పథకాలకు సబ్సిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) స్వయం ఉపాధి పథకాలకు అందించే ఆర్థిక సహకారంలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే సబ్సిడీ ఇవ్వాలని సీఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దీనికి సంబంధించిన దస్త్రంపై గురువారం సీఎం సంతకం చేశారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించే నిధులనుంచి స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీ అందించాలని సీఎం సూచించారు. ఈసారి బడ్జెట్‌లో ఈమేరకు ఎంబీసీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయిస్తామన్నారు. వెనుకబడిన తరగతుల యువత స్వయం ఉపాధి కోసం ఎకనామిక్ సపోర్టు పథకం కింద గతంలో లక్ష రూపాయలకుగాను 60 శాతం సబ్సిడీ ఇస్తుండగా, ఇకనుంచి దీన్ని 80 శాతానికి పెంచతున్నట్టు సీఎం ప్రకటించారు. అలాగే గతంలో లక్ష రూపాయలున్న యూనిట్‌ను ఇకనుంచి 12 లక్షల వరకూ పెంచుతున్నట్టు సీఎం ప్రకటించారు. లక్ష రూపాయల యూనిట్‌కు అందించే ఆర్థిక సహకారంలో 80వేలు (80 శాతం) సబ్సిడీ, రూ. 2 లక్షల వర కు అందించే యూనిట్‌కు రూ.1.4 లక్షలు (70 శాతం), రూ.2 లక్షల నుంచి 12 లక్షల వరకూవున్న యూనిట్లకు 60శాతం (గరిష్టంగా రూ.5 లక్షలు) సబ్సిడీ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎంబీసీల స్వయం ఉపాధికి సబ్సిడీని ఖరారు చేయడంతో అమలు చేయాల్సిన పథకాలకు రూపకల్పన చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు.