రాష్ట్రీయం

కేసీఆర్‌ది తుగ్లక్ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 8: రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ తుగ్లక్ పాలన సాగుతోందని, తలా తోకాలేని నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులను గురి చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ జిల్లాలో మండలాలుగా విభజించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ పార్లమెంట్‌కు బిల్లుపంపితే కేంద్రం తిరస్కరించిందన్నారు.
పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పిన సమాధానంతో ఈ విషయం స్పష్టమైందన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రజా చైతన్య బస్సు యాత్ర సందర్భంగా నిర్వహించిన సభలో ఉత్తమ్ ముఖ్య అతిధిగా మాట్లాడారు. ఎన్నికల ముందు ముస్లిం మైనార్టీలకు 12శాతం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, తెరాస అధికారంలోకి వస్తే తొలి సంతకం చేస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై శాసన సభలో బిల్లు చేసి పంపితే, సాంకేతిక లోపాలతో కేంద్రం తిరస్కరించిందన్నారు. ఆ విషయాన్ని తెరాస సర్కారు దాచి ఉంచిందన్నారు. దళితులకు మూడు ఎకరాలు, ఇంటికో ఉద్యోగం పేరిట ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ముస్లింలు, గిరిజనులను మోసం చేసిన కేసీఆర్, వచ్చే ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కోల్పోయారన్నారు.
4 వేలమంది రైతు ఆత్మహత్యలు
కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో నాలుగు వేలమంది రైతు లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఉత్తమ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులను పట్టించుకోని సీఎం కేసీఆర్, జాతీయ పార్టీలపై నెపం నెడుతూ థర్డ్‌ఫ్రంట్ డ్రామాకు తెరలేపారన్నారు. రైతులకు రుణమాఫీని నాలుగు విడతల్లో చేయడం వల్ల, ఇప్పటికి వడ్డీ మాత్రమే మాఫీ అయిందన్నారు. కందుల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని ఎన్ని డిమాండ్లు చేసినా సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటూ కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు వేల కోట్లు చెల్లిస్తున్న కేసీఆర్, పేద రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని, వెంటనే రైతుకు 2 లక్షల రుణమాఫీ ఒకేసారి ప్రకటిస్తామన్నారు. వరి రైతుకు 2 వేలు తక్కువకాకుండా మద్దతు ధర, బోనస్ చెల్లించి కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని 6 లక్షల మహిళా గ్రూపులకు లక్ష రివాల్వింగ్ గ్రాంట్ అందిస్తామని, 10 లక్షలు వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు. అభయహస్తం పింఛన్‌ను పునరుద్ధరించి వెయ్యి రూపాయల చొప్పున అందిస్తామన్నారు. తెరాస సర్కారునిరుద్యోగులను పూర్తిగా విస్మరించిందన్నారు. రాష్ట్రంలో 1.07 లక్షల ఉద్యోగాలు ఖాళీగావుంటే, 10వేల ఉద్యోగాలు సైతం కేటాయించలేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులకు 3 వేల నిరుద్యోగ భృతి అందచేయనుందన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జి రాంచందర్ కుంతియా, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్‌అలీ, జీవన్‌రెడ్డి, శ్రీ్ధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రజాచైతన్య యాత్రలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమర్‌రెడ్డి