రాష్ట్రీయం

హైదరాబాద్‌లో మహిళా వర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: హైదరాబాద్‌లో మహిళా వర్శిటీ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు లలిత కళాతోరణంలో గురువారం అధికారిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 20మందికి ప్రభుత్వం తరఫున లక్ష రూపాయల నగదు, మెమెంటోలతో అవార్డులు అందించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ మహిళల కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిందని, త్వరలోనే మహిళా వర్శిటీ ప్రారంభించనుందని వెల్లడించారు. కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రాష్టవ్య్రాప్తంగా ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలతోపాటు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ సంస్థల్లోనూ, వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల్లో మహిళా దినోత్సవ వేడుకలు జరిపారు.

చిత్రం..ప్రతిభావంత మహిళలకు అవార్డులు అందచేస్తున్న మంత్రి తుమ్మల తదితరులు