ఆంధ్రప్రదేశ్‌

నేడు ఆదిత్యుని జయంతి ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: రథ సప్తమి సందర్భంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి జయంతి ఉత్సవం ఆదివారం జరగనుంది. మూలవిరాట్‌కు మహాభిషేకం నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఆదిత్యుని దర్శించుకోనున్నారు. మాఘ శుద్ధ సప్తమినాడు నిర్వహించనున్న ఆదిత్యుని జయంతి ఉత్సవం (రథసప్తమి)లో ఆదివారం తెల్లవారుజామున 12.15 గంటలకు సుప్రభాత సేవ, ఉషఃకాలార్చన అనంతరం ఒంటి గంట నుంచి ఆరు గంటల వరకూ మహాభిషేక సేవ (మూలవిరాట్‌కు క్షీరాభిషేకం) జరుగుతుంది. అత్యంత అరుదైన శ్రీ సూర్యభగవానుడి నిజరూప సందర్శన సేవ సాయంత్రం నాలుగు గంటల వరకూ ఉంటుంది. విశేష అర్చనలు, ద్వాదశ హారతి, మహానివేదన అనంతరం నాలుగు గంటల తర్వాత ఆదిత్యునికి విశేష పుష్పమాలల అలంకార సేవ ఉంటుంది. సాయంత్రం ఆరు గంటల తర్వాత నీరాజనం, సర్వదర్శనం, ఏకాంత సేవతో శ్రీ సూర్యనారాయణస్వామి వారి జయంత్యుత్సవం ముగియనుంది.
దేశంలోనే పేరుగాంచిన దేవాలయాల్లో అరసవల్లి ఆదిత్య దేవాలయం ఒకటి. ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్న సూర్యభగవానుడు దేవేంద్రునిచే స్వయంభూ మూర్తిగా ఇక్కడ వెలసి విరాజిల్లుతున్నారని స్థలపురాణం స్పష్టం చేస్తోంది. అందులోనూ ఆదిత్యునికి అత్యంత ప్రీతికరమైన రవివారం (ఆదివారం) రోజున ఆయన పుట్టినరోజు ఘడియలు కలవడంతో ఈసారి రథసప్తమి మరింత ప్రత్యేకత సంతరించుకుంది.

భక్తిప్రపత్తులతో ‘విజరుూభవ’

విజయవాడ (ఇంద్రకీలాద్రి) ఫిబ్రవరి 13: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గమ్మ అమ్మవారు చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిగా విద్యార్థులను కరుణించింది. వచ్చే పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించాలని దుర్గగుడి ఇఒ నరసింగరావు నేతృత్వంలో ఏటా ఇంద్రకీలాద్రిపై ‘విజరుూభవ’ పేరుతో సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మను కొలవడం, ప్రత్యేక పూజలు చేయడం జరుగుతోంది. దీనిలో భాగంగా శ్రీపంచమి సందర్భంగా ‘విజరుూభవ’ ఏర్పాటు చేసి విద్యార్థుల కోసం శనివారంనాడు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్, ఆలయ ప్రధాన అర్చకుడు లింగంబొట్ల దుర్గాప్రసాద్ తదితరుల ఆధ్వర్యంలో శనివారం ఉదయం దుర్గగుడి ఇవో దంపతులతో అమ్మవారి సన్నిధిలో తొలుత శ్రీ సరస్వతీ హోమాన్ని నిర్వహించారు. విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఈ పథకం కింద వారికి ప్రత్యేక దర్శనం చేయించి, అనంతరం అమ్మవారి ఫొటో, లడ్డూ, రక్షాబంధం, కుంకుమ, పెన్ను ఉచితంగా అందచేసారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన సుమారు 40వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయాల్లో దక్షిణను
‘లంచం’ అనలేం

స్పష్టం చేసిన అర్చక సమాఖ్య

హైదరాబాద్, ఫిబ్రవరి 13: దేవాలయాల్లో భక్తులు హారతిపళ్లెంలో భక్తితో సమర్పించే డబ్బును ‘లంచం’ అనడం సబబుకాదని ఎపి అర్చక సమాఖ్య పేర్కొన్నది. సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యదర్శి పెద్దింటి రాంబాబు, పద్మనాభ శర్మ, సుధీర్, ఫణిగోపాల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, హారతిలో వేసే దక్షిణను చంద్రబాబు లంచంగా అభివర్ణించడం ఆక్షేపణీయమన్నారు. చల్లా కొండయ్య కమిషన్ సిఫార్సులను పూర్తిగా అమలు చేస్తే దేవాలయాల పరిస్థితి దిగజారిపోయేదన్నారు. అర్చకులకు కనీస జీవనభృతి లేనిస్థితిలో 20 వేల ఆలయాలున్నాయని పేర్కొన్నారు.