రాష్ట్రీయం

బాబు భలే నటుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మార్చి 10: చంద్రబాబు మహానటుడని,నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎన్నో నాటకాలు, డ్రామాలు వేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆస్కార్ టీమ్ కనుక చంద్రబాబును చూసి ఉంటే అవార్డు ఇచ్చేవారని వ్యంగ్యోక్తి విసిరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా చీరాల నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ శనివారం మధ్యాహ్నం నియోజక వర్గ కేంద్రంలోని క్లాక్ టవర్ సర్కిల్ వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. చంద్రబాబు పాలన అంతా అబద్ధాలు, మోసాలు మాత్రమేనని అవి పునాదులుగా ఆయన పాలన సాగుతుందన్నారు. పార్టీ మారిన వారితో రాజీనామాలు చేయించడం లేదని, మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదన్నారు. రాష్ట్రానికిప్రత్యేక హోదా సాధనకు చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, అందుకే ఆ పోరాటంలో తమతో కలిసి రావడం లేదని జగన్ ధ్వజమెత్తారు. నాలుగు సంవత్సరాల్లో అవినీతి , అన్యాయమైన , దుర్మార్గపు పాలన సాగుతోందన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతున్నందున ఒక్కసారి చంద్రబాబు నాలుగు సంవత్సరాల పాలనను సమీక్షించుకోవాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్ పై రాష్ట్రంలోనే అత్యధికంగా పన్నులు విధిస్తున్నారన్నారు. ప్రతి గ్రామంలో మినరల్‌వాటర్ ప్లాంట్ లేకపోయినా బెల్టు షాపులు మాత్రం ఉన్నాయని జగన్ ఆరోపించారు. వ్యవసాయ రుణాలు, చేనేతల
రుణాలు మాఫీ చేస్తానన్నాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు కానీ రుణ మాఫీ చేయక పోవడంతో బంగారం బయటకు రాక పోగా నేడు బ్యాంకులు బంగారాన్ని వేలం వేస్తామంటూ నోటీసులు జారీ చేస్తున్నారన్నారు. జాబ్ రావాలంటే బాబూ రావాలంటూ ప్రతి ఇంటికి చంద్రబాలు లేఖ పంపారని , ఇంటింటికి ఉద్యోగం , ఉపాధి కల్పించక పోతే నెలకు రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తారన్నారని కాని దాదాపు 47 నెలలుగా ఆ మొత్తం ఇవ్వక పోవడం వలన ప్రతి ఇంటికి 94 వేలు బాకీ పడ్డారని ధ్వజమెత్తారు. కాబట్టి ఎప్పుడైనా చంద్రబాబు కనిపిస్తే ఆ మొత్తం గురించి అడగండి అని ఆయన ప్రజలను కోరారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని జగన్ ధ్వజమెత్తారు. ప్రతి పనికి ఆ కమిటీలు లంచం తీసుకుంటున్నాయని, చంద్రబాబు పాలన అంతా దారుణంగా ఉందన్నారు. చంద్రబాబు అన్యాయమైన పాలన చేస్తూ ఎలాగో ఉద్యోగాలు ఇవ్వడంలేదూ... అదే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండేవన్నారు. కాని చంద్రబాబు దానిని తాకట్టు పెట్టాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే తనకు బ్రిటీష్ పాలకుల మాటలు గుర్తుకు వస్తున్నాయన్నారు. వాస్తవానికి ఇటీవల అరుణ్ జెట్లీ కొత్తగా మాట్లాడిందేమీ లేదని, 2016 సెప్టెంబర్ లో కూడా అవే మాటలు చెప్పారన్నారు. అప్పుడే చంద్రబాబు కేంద్ర మంత్రి వర్గం నుండి వై తొలగి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తే అడ్డుకున్నాడని, బంద్‌కు పిలుపునిస్తే బస్సులు నడిపించారని, పిఎం వస్తున్నాడని నిరాహార దీక్ష చేపడితే బలవంతంగా ఎత్తి వేయించారని జగన్ ఆరోపించారు. నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక హోదాను పూర్తిగా నీరుగార్చిన చంద్రబాబు నేడు కేంద్రం నుండి వైతొలగినా ఇంకా ఎన్‌డిఏ లో కొనసాగుతున్నారని ఆక్షేపించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరామన్నారు. అలాగే మూకుమ్మడిగా 25 మంది ఎంపి లతో రాజీనామాలు చేయిద్దామని కోరినప్పటికీ ఆయన దేనికీ స్పందించడం లేదని జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబును పొరపాటున అయినా క్షమించవద్దని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు బాబు డబ్బు ఇస్తే తీసుకోండి... రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బు కాబట్టి ఐదు వేలు తీసుకోండి కాని ఓటు వేసేటప్పుడు మీ మనసాక్షిగా అనుగుణంగా ఓటు వేయాలని తెలిపారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ ను బాగు చేసేందుకు పాదయాత్ర చేస్తున్నానని తనను ఆశీర్వదించాలని, ఆదరించాలని జగన్ కోరారు.

చిత్రం..చీరాల భారీ బహిరంగ సభలో మాట్లాడుతున్న జగన్